ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికలు తొమ్మిది నెలల కాలంలో ఒకపక్క సంక్షేమాన్ని ప్రవేశపెడుతూ మరోపక్క అభివృద్ధి పై కూడా దృష్టి సారిస్తున్నారు. చాలా విషయాలలో జగన్ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు ప్రజలలోనుండి వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నించిన సందర్భంలో జగన్ వారి ఆరోపణలకు ప్రతి స్పందించకపోవటం వల్ల తన ప్రభుత్వంపై నెగిటివిటీ అనేది రాకుండా చేసుకున్నారని చాలామంది రాజకీయ మేధావులు అంటున్న వ్యాఖ్యలు. ఏ మాత్రం కూడా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు మరియు దీక్షలకు నిరసనలకు జగన్ ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోవటమే తన గవర్నమెంట్ కి అతి పెద్ద ప్లస్ పాయింట్ అని అంటున్నారు.

 

ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అవినీతి గురించి ఏ మాత్రం వార్తలు ముందు బయటకు రాకుండా సడన్ గా ఒక్కసారిగా ప్రత్యర్థులకు దిమ్మతిరిగిపోయే విధంగా ఆధారాలతో సహా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసి జగన్ చేస్తున్న రాజకీయం సూపరో సూపర్ అని అంటున్నారు చాలామంది. ఈ విధంగానే ఇటీవల తెలంగాణలో ఈఎస్ఐలో భారీ అవినీతి స్కాం బ‌య‌ట‌ప‌డ‌టం...ఏపీలో కూడా అలాంటిది ఏమైనా జ‌రిగి ఉంటుందేమోన‌నే అనుమానం ప్ర‌భుత్వానికి వ‌చ్చింది. వెంట‌నే విజిలెన్స్ విచార‌ణ చేప‌ట్ట‌డం, అవినీతిని ఆధారాల‌తో స‌హా వెల్ల‌డించ‌డం చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి.

 

ఏ మాత్రం ఎక్కడా కూడా టైం గ్యాప్ ఇవ్వకుండా చాలా పకడ్బందీ తో జగన్ ఆధారాలతో సహా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి ని ఈఎస్ఐ స్కామ్‌ బయటపెట్టడం జగన్ సర్కార్ కి అతి పెద్ద ప్లస్ పాయింట్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఈ స్కామ్‌లో తెలంగాణ రాష్ట్రంలో పట్టుబడిన పలువురు అధికారులు, సరఫరాదారులు, కాంట్రాక్టర్లను అక్క‌డి ప్రభుత్వం   జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే రూట్ లో జగన్ సర్కార్ కూడా ఆలోచిస్తున్నట్లు...త్వరలోనే ఈ స్కామ్ కి సంబంధించి టీడీపీ మంత్రులు జైలుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ఏపీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: