రాజకీయాల్లో కక్షసాధింపు సర్వ సాధారణం. ఎవరికి టైం వస్తే వారు ప్రత్యర్థులపై రెచ్చిపోతారు. అయితే ఆంధ్రా లో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జగన్ అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తనని దారుణంగా టార్గెట్ చేసిన నాయకులను ఎవరిని వదలడం లేదని ఏపీ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెయిన్ టార్గెట్ చంద్రబాబుని ఇన్సైడర్ ట్రేడింగ్ మరియు ఐటీ రైడ్స్ విషయంలో కీలకంగా జగన్ అండర్ గ్రౌండ్ వర్క్ తో బ్లాక్ చేశారన్న వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.

 

తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు సర్కార్ అనేక రీతులుగా తనని మరియు తన పార్టీకి చెందిన వారిని నానా ఇబ్బందులకు గురి చేయడంతో జగన్ ఇప్పుడు ఫుల్ మెజార్టీతో ఉండటంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బయటపడుతున్న ఏ ఒక్క కేసు ను వదలడం లేదన్న కామెంట్లు ఏపీ మీడియాలో మరియు రాజకీయాల్లో గట్టిగా వినబడుతుంది.

 

ఇందువల్లనే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పై తాజాగా బయటపడిన ఈఎస్ఐ స్కాం విషయంలో జగన్ చాలా సీరియస్ గా ఉన్నట్లు...తెలంగాణ సర్కార్ మాదిరిగా ఈ కుంభకోణంలో అధికారులను మంత్రులను జైల్లో పెట్టించడానికి అన్ని ఆధారాలు పగడ్బందీ గా సేకరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అచ్చెన్నాయుడు భయంకరమైన బూతులు మరియు తీవ్రమైన పరుషపదజాలం వాడటంతో ఈ కుంభకోణంతో అచ్చెం నాయుడికి రాజకీయంగా ఫుల్ స్టాప్ పెట్టడానికి జగన్ ఈఎస్ఐ కుంభకోణంలో కీలక నిర్ణయాలు తీసుకో బోతున్నట్లు వైసీపీ పార్టీలో టాక్. మొత్తంమీద చూసుకుంటే ఈఎస్ఐ కుంభకోణం ద్వారా అచ్చెన్నాయుడి కి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేయడమే జగన్ టార్గెట్ ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి కనబడుతోంది. మరోపక్క ఈ వార్తను తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది కావాలని తమపై జగన్ సర్కార్ బురదజల్లడానికి చేస్తున్న ప్రయత్నం అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: