ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి చేస్తూ మరో పక్క సంక్షేమాన్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజలకు తన పరిపాలనలో ఏమాత్రం కష్టం రాకుండా మరియు అదే విధంగా నాయకుల పనితనంలో అవినీతి లేకుండా అన్ని జాగ్రత్తలు చూసుకుని పరిపాలిస్తున్నారు. అన్ని రకాలుగా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న జగన్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా వెనుకంజలో ఉంది పారిశ్రామికంగా.

 

ఇదే సందర్భంలో ఎప్పుడు వెనుకంజలో ఉండే ఒరిస్సా కూడా ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దాటి ముందుకు వెళ్ళటం దేశంలోనే సంచలనం అయింది. దీంతో అర్జెంటుగా వైయస్ జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి సరైన దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఏపీ లో ఉన్న రాజకీయ మేధావులు కామెంట్ చేస్తున్నారు. చాలా సందర్భాలలో పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వని ఆఫర్లు తెలంగాణలో పారిశ్రామికంగా తెలంగాణ సర్కార్ ఇస్తుందని కెసిఆర్ గవర్నమెంట్ ప్రకటించడంతో పక్కనే ఉన్న ఏపీకి చాలా తీవ్రమైన నష్టం ఇప్పటికే స్టార్ట్ అయిందని ఈ విషయంలో జగన్ సర్కారు దృష్టి పెట్టకపోతే పారిశ్రామికంగా ఏపీ కనుమరుగవడం గ్యారెంటీ అని అంటున్నారు.

 

అంతేకాకుండా తెలంగాణ సర్కార్ జాతీయస్థాయి మరియు అంతర్జాతీయ స్థాయి సదస్సులతో చాలామంది పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఇదేవిధంగా జగన్ సర్కారు కూడా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని సలహాలు కూడా ఇస్తున్నారు. ఏది ఏమైనా జగన్ సర్కార్ రాష్ట్రంలో సంక్షేమాన్ని మరియు అదే విధంగా అభివృద్ధిపై దృష్టి పెడుతున్న పారిశ్రామిక రంగంపై కూడా అర్జెంటుగా దృష్టి పెట్టకపోతే ఏపీ డేంజర్ జోన్ లో పడినట్లే అనే కామెంట్స్ వినబడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: