సమాజం సిగ్గుపడే ఈ సంఘటన మన హైదరాబాద్ తాలూకాది కావడం దురదృష్టకరం. భాగ్య నగరానికి చెందిన   సత్యకుమార్ అనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను, బెంగళూరులో జరిగిన ఒక హత్య కేసులో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ హత్య మరెవరిదో కాదు.. స్వయానా సత్యకుమార్ తోడల్లుడు లక్ష్మణ్ కుమార్ ది! ఫిబ్రవరి మూడో తేదీన బెంగళూరులో లక్ష్మణ్ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... లక్ష్మణ్ కుమార్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతడి హత్యపై శోధించిన పోలీసులు నివ్వెరపోయే విషయాలను బయటపెట్టారు. సత్యకుమార్ లక్ష్మణ్ లు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. 

 

అయితే సత్యకుమార్ కు తన భార్య చెల్లెలు-లక్ష్మణ్ భార్యతో సంబంధం ఏర్పడింది. వారిద్దరూ  ఎఫైర్ ను కొనసాగించారు. ఈ క్రమంలో లక్ష్మణ్ ను అడ్డు తొలగించుకోవాలనే కపటాన్ని రచించాడు సత్యకుమార్.అందు కోసం ఏకం సుపారీ ఇచ్చాడు. తన తోడల్లుడిని చంపాలని అతడి ఫొటోను పంపించి బెంగళూరులో ఒక గ్యాంగ్ కు కాంట్రాక్టు ఇచ్చాడు. వాళ్లు ఒకసారి అటెంప్ట్ చేశారు. అయితే అప్పుడు లక్ష్మణ్ తప్పించుకున్నాడు. గాయాలతో బయటపడ్డాడు. అయితే అప్పటికీ సత్యకుమార్ తీరు మారలేదని తెలుస్తోంది. ఎటుతిరిగి చంపాల్సిందే అంటూ గ్యాంగ్ పై ఒత్తిడి చేశాడట. 

 

దీంతో వారు బెంగళూరులో ఆఫీసుకు వెళ్తున్న లక్ష్మన్ మీద నడిరోడ్డు లో అటాక్ చేసి, దారుణంగా హతమార్చారు. అయితే ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది! అక్కడ కథ మలుపు తిరిగింది. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. తమదైన రీతిలో విచారణ చేయగా.. హత్య వెనుక కుట్ర మొత్తం బయటకు వచ్చింది. మరదలితో ఎఫైర్ కొనసాగించడానికి తోడల్లుడిని హతమార్చడం అనే దారుణమైన కుట్రను చేసిన సత్యకుమార్ ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

లక్ష్మణ్ హత్య జరిగే వరకూ.. కుటుంబీకులు ఎవరూ సత్యకుమార్ నిజస్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోయారట. లక్ష్మణ్ ను ఎవరో హత్య చేశారంటూ.. అతడు తన భార్యతో పాటు బెంగళూరుకు హుటాహుటిన చేరుకున్నాడట! తనే అంతపని చేయించి.. ఏం తెలియని అమాయకుడిలా కలరింగ్ ఇచ్చినా అసలు గుట్టు మాత్రం చివరకు బయటపడినట్టుగా ఉంది! అన్యాయం ఎప్పటికైనా అరికాబడుతుంది కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: