ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా ఎలాంటి పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ రాజకీయమైన సోషల్ మీడియా వేదికగానే జరుగుతుంది. రాజకీయ పార్టీలన్నీ సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకుంటున్నాయి. ప్రత్యర్ధులపై విమర్శలు చేయాలన్న, తాము చేసే పనులని చెప్పుకోవాలన్న సోషల్ మీడియానే పెద్ద దిక్కుగా ఉంది. ఇక ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఇదే వేదికగా విమర్శలు చేసుకుంటున్నాయి.

 

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అధికార వైసీపీ కంటే టీడీపీ వాళ్లే ఫుల్ డామినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ వాళ్ళు ఫుల్ యాక్టివ్‌గా ఉండి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. కాకపోతే గత ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కువ యాక్టివ్‌గా ఉండేవారు. ఓ రకంగా జగన్‌ని అధికారంలోకి తీసుకురావడంలో వైసీపీ సోషల్ మీడియా పాత్ర చాలా ఎక్కువ.

 

వారే టీడీపీ ప్రభుత్వం యొక్క ప్రజావ్యతిరేక నిర్ణయాలని తమ పోస్టుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాగే ఏదైనా పోల్స్ జరిగిన వైసీపీకే వన్ సైడ్ విక్టరీ అందేలా చేసేవారు. ఉదాహరణకు 2019లో కాబోయే సీఎం ఎవరు అంటూ చంద్రబాబు, జగన్ పేర్లతో పోల్స్ క్రియేట్ చేస్తే, జగన్‌కే ఎక్కువ సపోర్ట్ వచ్చేది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫుల్ డామినేట్ చేసిన వైసీపీ సోషల్ మీడియా అధికారంలోకి వచ్చాక తగ్గిపోయింది.

 

ఇప్పుడు డామినేషన్ టీడీపీ వాళ్ళది అయిపోయింది. వాళ్ళు చేసే నెగిటివ్ ప్రచారం ఎక్కువ ఉంటుంది. పైగా జనసేన కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగానే ఉన్నారు. వాళ్ళు కూడా జగన్ ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం బాగా చేస్తున్నారు. అందుకే వీరి ప్రచారానికి వైసీపీ వాళ్ళు పూర్తిగా చెక్ పెట్టలేక ఉన్నారు. అటు పోల్స్‌లో కూడా జగన్‌కు మద్ధతు తక్కువ అయిపోయింది. ఏదైనా విషయం మీద పోల్ పెడితే టీడీపీ, జనసేన వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా సోషల్ మీడియాలో వైసీపీని టీడీపీ, జనసేనలు డామినేట్ చేస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: