తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత  లీడింగ్ తీసుకునే నాయకుడు ఎవరంటే? టీడీపీ కార్యకర్తలకు ఇష్టం లేకపోయిన నారా లోకేశ్ పేరు చెబుతారు. చంద్రబాబు తర్వాత ఆయనే పార్టీని నడిపిస్తారని అంటారు. అయితే చంద్రబాబు మాదిరిగా లోకేశ్‌కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటే? అబ్బే ప్రస్తతానికైతే అలాంటివి ఏమి లేవని చెప్పేస్తారు. తర్వాత ఏమన్నా నాయకుడుగా ఎదుగుతాడా? అంటే చెప్పలేం అంటారు?

 

ఇలా లోకేశ్ నాయకత్వంపైన టీడీపీ కార్యకర్తల్లోనే ఇంత అనుమానం ఉంటే ప్రజలకు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు చంద్రబాబు కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్‌కు సరిగా మాట్లాడటమే రాదని చాలాసార్లు అర్ధమైంది. ఆయన వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. అయినా చంద్రబాబు, చినబాబుని ఏదొకవిధంగా మంత్రిని చేసి లాక్కొద్దామని ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్సీని చేసి మంత్రిని కూడా చేశారు. కానీ ఏదో చేతిలో పని కాబట్టి చేశారు గానీ, ప్రజల్లోకి వచ్చేసరికి అది కుదరలేదు. మంగళగిరి ప్రజలు లోకేశ్‌ని ఘోరంగా ఓడించారు.

 

అయితే లోకేశ్‌లో ఓడిపోయాక కూడా పెద్దగా మార్పు రాలేదు. ఇప్పటికీ చంద్రబాబు కష్టపడుతూ, రాష్ట్రమంతా తిరుగుతూ, జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. కానీ చినబాబు మాత్రం ట్విట్టర్‌లోనే పోరాటం చేస్తున్నారు. పోనీ ఎప్పుడన్నా బయటకొచ్చి హడావిడి చేస్తున్న, ఆయన వెనుక యువ నేతలు ఎవరు రావడం లేదు. తమ భవిష్యత్ నాయకుడు అన్న భావన కూడా టీడీపీలో ఉన్న కొందరు యువ నాయకుల్లో ఇంకా కలగడం లేదు.

 

అసలు ఏ ఒక్క యువ నేత కూడా లోకేశ్ వెనుక తిరుగుతున్నట్లు కనిపించడం లేదు. పైగా దేవినేని అవినాష్‌కు జరిగిన అనుభవం దృష్టిలో పెట్టుకుని, యువనేతలు బాబోయ్ చినబాబుతో మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఒకానొక సమయంలో సీనియర్ నేతలైన చినబాబు వెనుక ఉంటున్నారుగానీ, యువ నేతలు మాత్రం కనబడటం లేదు.  ఏదైనా సమయంలో లోకేశ్ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళనలు చేయాలి రమ్మన్న వారు మాత్రం మా వల్ల కాదులే, మమ్మల్ని వదిలేయండి అని చెప్పేస్తున్నారు. మొత్తానికైతే చినబాబు దెబ్బకు టీడీపీ యువ నేతలు జంకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: