పులిహోర కలపడంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఎప్పుడూ ముందే ఉంటుంది. రాజకీయంగా మరి ఆ పార్టీకి వచ్చే లాభం ఏంటో తెలియదు గాని చిన్న వార్త వస్తే చాలు దానికి పౌడర్ రాసి, మల్లెపూలు పెట్టి, బొట్టు కాటుక పెట్టి, సెంట్ కొట్టి అందంగా ముస్తాబు చేస్తుంది టీడీపీ సోషల్ మీడియా. ఇక నారా లోకేష్ లాంటి వారు కూడా ఈ విషయంలో కాస్త రెండు అడుగులు ముందే ఉంటారు అనేది కూడా అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు సిఎం పదవి విషయ౦ లో అదే జరుగుతుంది. 

 

జగన్ ఢిల్లీ వెళ్లారు... ఆయన ఎం చర్చించారో, ఎం మాట్లాడారో ఎవరికి తెలియదు. వైసీపీ నేతలు మాత్రం రాజధానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అన్నారు. అంత వరకు బాగానే ఉంది. కాని ఇక్కడ టీడీపీ సోషల్ మీడియా మాత్రం, జగన్ ని జైలుకి పంపిస్తున్నారు అంటూ కొన్ని వార్తలను వండి వార్చే ప్రయత్నాలు విజయవంతంగా చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా కొత్త ప్రచారానికి తెర లేపింది. భారతి, షర్మిల మధ్య ముఖ్యమంత్రి పదవి విషయంలో కొత్త చర్చలు జరుగుతున్నాయని వాదిస్తున్నారు టీడీపీ నేతలు. 

 

తాడేపల్లి నివాసంలో ఇటీవల ఈ పదవి విషయంలో జగన్ సతీమణి భారతి, ఆయన సోదరి షర్మిల మధ్య వాగ్వాదం జరిగిందని, తాను జగన్ జైల్లో ఉంటే పాదయాత్ర చేశా అని చెప్పగా భార్యగా ఆయన తర్వాత తనకే అధికారాలు, హక్కు ఉన్నాయని భారతి వాదించారట. రాజ్యసభకు వెళ్ళమని షర్మిల కు జగన్ సూచించారని మరో సోది చెప్పింది టీడీపీ సోషల్ మీడియా. రాజ్యసభ గురించి చర్చలు జరగడం అనేది నిజం. కానీ దాన్ని ఈ విధంగా టీడీపీ సోషల్ మీడియా మార్చి ప్రచారం చేయడం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో కావాల్సిన వినోదాన్ని అన్ని విధాలుగా పంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: