ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీకానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు ఎవరికి దక్కనున్నాయన్న దానిపై   వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వాడివేడి చర్చ కొనసాగుతోంది . నాలుగు స్థానాలను సామాజిక సమీకరణ నేపధ్యం లో రెడ్డి , కమ్మ , కాపు , బీసీ వర్గాలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు .   వైస్సార్ కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందిన వారే కావడం , ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లో ఒక  స్థానాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ నేత  బీదా మస్తాన్ రావు కు కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది .

 

ఇటీవల బీదా మస్తాన్ రావు టీడీపీ వీడి,  విజయసాయి చొరవతో  వైస్సార్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెల్సిందే . ఇప్పటి వరకు టీడీపీ నాయకత్వం  యాదవ సామాజిక వర్గానికి రాజ్యసభ పదవి కేటాయించకపోవడం , టీడీపీ అధినేత చంద్రబాబు చేయలేని పని తాను చేయాలనుకుంటున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ... బీదా మస్తాన్ రావు కు రాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టేందుకు సుముఖంగా ఉన్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది . అయితే మండలి రద్దు కానున్న నేపధ్యం లో ఇద్దరు బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రుల్ని కూడా రాజ్యసభ కు పంపే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి .

 

అదే నిజమైతే ముగ్గురు బీసీ నేతలకు రాజ్యసభ స్థానాలు కట్టబెట్టడమన్నది అసాద్యమని అంటున్నారు . అయితే ముగ్గురిలో జగన్ మదిలో ఎవరున్నరన్నది హాట్ టాఫిక్ గా మారింది . ఇప్పటికే మస్తాన్ రావు కు హామీ ఇచ్చిన నేపధ్యం ఆయన కు రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తారా? లేకపోతే మండలి రద్దు తో పదవి కోల్పోతున్న  ఇద్దరు మంత్రుల్లో ఒకరి అవకాశం కల్పిస్తారా ?? అన్నది వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: