ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీ నేతల వ్యవహార శైలి పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్న అధికార పార్టీలో ఆధిపత్య పోరు అనేది రోజు రోజు కి పెరుగుతుంది అనే విమర్శలు వినపడుతున్నాయి. ముఖ్యంగా పార్టీ లో ముందు నుంచి ఉన్న వాళ్ళకు, కొత్తగా మంత్రులు అయిన వాళ్లకు మధ్య విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యే ల మధ్య విభేదాలు బయటకు వచ్చాయి. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విషయం లో ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహంగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. 

 

ఇక ఎంపీ లావు కృష్ణ దేవరాయల తో విడదల రజనికి కూడా విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల అవి బయటపడ్డాయి కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు మంత్రి కొడాలి నానీ ని కొందరు టార్గెట్ చేసారని అంటున్నారు. ఆయనను ఇటీవల శాసన సభ లో ముఖ్యమంత్రి జగన్ పొగిడారు. ఆయన తనకు అత్యంత సన్నిహితుడు అంటూ కొన్ని మాటలు మాట్లాడారు. ఇక మీడియా లో కూడా ఆయన హవా ఎక్కువగా ఉంది. దీనితో ఇప్పుడు రాయలసీమ లో ఉన్న కొందరు సీనియర్ నేతలు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. 

 

జగన్ కోసం ఆయన టీడీపీ ని వదిలి వచ్చారు ఏమో, మేము మంత్రి పదవుల ను కూడా వదులుకుని జగన్ కోసం చాలా త్యాగాలు చేసామని, అలాంటి మమ్మల్ని జగన్ పట్టించుకోకుండా ఆయనను కొనియాడటం ఏంటీ అంటూ పలువురు ఆగ్రహం గా ఉన్నట్టు సమాచారం. పార్టీ కోసం తాము చాలా త్యాగాలు చేసామని అంటున్నారు. పార్టీ లో ప్రభుత్వం లో కొడాలి నానీ సన్నిహితంగా ఉండవచ్చు లేకపోతే చంద్రబాబు లాంటి వాళ్ళను ఎక్కువగా తిట్ట వచ్చు కాని తాము కూడా జగన్ మీద అభిమానం తోనే వచ్చామని వాపోతున్నారట వాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: