కూటికోసం కోటి విద్యలు అన్నారు మన పెద్దలు.. మనిషిగా పుట్టామంటే చచ్చేదాక ఏదో ఒకపని చేసుకొని బ్రతాకాలని అంటారు మరికొందరు. ఇక ఇలాంటి మాటలు కొందరిలో స్పూర్తిని నింపితే, మరికొందరిని వక్రమార్గాన నడిపించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇకపోతే లోకంలో ఇప్పుడు ఉపాధి అవకాశాలను విభిన్నమైన మార్గాల్లో వెతుక్కుంటున్నారు కొందరు... అలాంటి వారి దారిలో నడవకుండా ఇంకా ప్రత్యేకమైన మార్గంలో ఓ మహిళ ప్రయాణించడానికి సిద్దపడింది. ఇలాంటి మార్గాన్ని దాదాపుగా ఎవరు ఎంచుకోక పోవచ్చూ. ఎందుకంటే, ఒక కట్టుకున్న వాడికి మాత్రమే సొంతం అని భావించే స్త్రీ అందాలు, డబ్బులకోసం బహిరంగ పరచడం అనే వృత్తిని ఎంచుకున్న ఈ మహిళ చరిత్రను తెలుసుకుంటే.

 

 

ఆమె ముగ్గురి పిల్లల తల్లి.. ఆమె చేసే పని గదులు శుభ్రం చేయడం. ఇక ఆమె సంపాదన గంటకు రూ.9వేలు. ఆమె పేరు క్లెయిర్ ఓ కానర్.. వయస్సు 35సంవత్సరాలు.. హౌజ్‌కీపింగ్‌లో భాగంగా హోటల్ గదులు శుభ్రం చేసేది. ఈ పనిని ఎంత చేసినా వచ్చే డబ్బులు మాత్రం అరకొరే.. ఈ దశలో అసంతృప్తితో నిండిన బుర్రలో ఇలాంటి కొత్త ఐడియాతో వచ్చిందట.. దీనికి పేరే ఫాంటసీ క్లీన్.. ఈ పేరుతో న్యూడ్‌గా ఉండి క్లీన్ చేయడమే ఆమె బుర్రలో వచ్చిన కొత్త ఐడియా. ఇకపోతే ఇది ఆన్‌లైన్ బిజినెస్ కావడంతో బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి శుభ్రం చేసి వెళ్లిపోతుంటుంది. అయితే ఇలా చేసేటప్పుడు ఆమెకు స్పెషల్ రూల్స్ ఉన్నాయి.

 

 

అవేంటంటే ముఖానికి మాస్క్ లేదా.. అండర్‌వేర్ ఏదో ఒకటి మాత్రం కచ్చితంగా ధరించడాన్ని బట్టి రేట్ మారుతుంది. ఇంతే కాకుండా తన పని తాను చేసుకునే సమయంలో ఎవరూ టచ్ చేయకూడదు. ఫొటోలు తీయకూడదు. ఎలాంటి లైంగిక పరమైనా ఎక్స్‌ట్రా పనులు చేయకూడదు. నేనొచ్చి నా పని నేను చేసుకుని వెళ్లిపోతానంతే' అని ముందుగా గట్టిగానే చెబుతుందట. ఇదే కాకుండా ఎవరైనా క్లీన్ చేయమని బుక్ చేయగానే వచ్చేయదు. ముందుగా వారి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాతే అన్ని రకాలుగా ఓకే అయితేనే వస్తుందట.

 

 

ఇక ఇందుకు గాను ఈవిడ తీసుకునే ఫీజు క్లీన్ చేసేటప్పుడు పూర్తిగా బట్టల్లేకుండా ఉంటే రూ.9వేలు, టాప్ మాత్రమే లేకుండా క్లీన్ చేస్తే రూ.8వేలు, అలా కాకుండా అండర్ వేర్, మాస్క్, బికినీ లాంటివి ధరించి క్లీన్ చేయాలంటే రూ.7వేలు అని ఫిక్స్ చేసిందట.. ఇక మొదట్లో  క్లెయిరె భయపడినా, బుక్ చేసుకున్న వారి గురించి మొదట ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వారి ఇంటికి వెళ్లి ధీమాగా పనిచేసుకోగలుగుతున్నట్లు తెలిపింది.. ఏది ఏమైనా మనిషికో పిచ్చి అంటారు కదా.. ఈ విడకున్నది ఇదొక పిచ్చి అనుకుంటున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: