మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు అడ్డు కట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన దిశా పోలీస్ స్టేషన్లో కూడా మహిళల కు రక్షణ లేకుండా పోయింది. మహిళల రక్షణ కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చిన ఈ చట్టాలు కొంత వరకు మహిళలను కాపాడుతాయి అనుకుంటే ఎక్కడ కూడా ఆ మాట వినపడలేదు.పైగా మహిళలపై ఈ స్టేషన్ లో పనిచేస్తున్న హోంగార్డు యువతిని మోసం చేసాడు. 

 


కృష్ణా జిల్లా మచిలీపట్నం లోని దిశ హోంగార్డు కీచకాని కి పాల్పడ్డాడు. మైనర్ బాలిక ను ప్రేమ పేరు తో లొంగదీసుకున్న హోంగార్డు కొద్ది రోజులుగా ఆమెతో శారీరక వాంఛలు తీర్చుకుంటున్నాడు. బాలిక శరీరం లో ఇటీవల మార్పులు చోటుచేసుకోవడం తో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించ గా గర్భవతి అని తేలింది. దీంతో షాకైన పేరెంట్స్ చిలకలపూడి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.. 

 


దిశా యాప్ ను వాడండి చిటికె లో మీకు అపాయం తప్పుతుంది అని అనాల్సిన ప్రత్యేక పోలీసులు . ఇలా చేయడం పై చాలా మంది పడుతున్నారు. ప్రేమ పేరు తో మాయ మాటలు చెప్పి ప్రేమ అని తెగ తెప్పించుకున్నారు చివరికి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యారు. అలా అయినా తర్వాత కొద్దీ రోజులు బాగా తిరిగారు.. 

 


దీంతో పోలీసులు కీచక హోంగార్డుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దిశ పోలీస్‌స్టేషన్లో పనిచేసే సిబ్బందే మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిరియస్ గా తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయాన్నీ సీఎం ఎలా స్పందిస్తాడో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: