పోలీసులు అంటేనే సమాజాన్ని రక్షించవలసిన బాధ్యతగల పౌరులు. ఈ వృత్తి చాలా పవిత్రమైనదని అందరికి తెలిసిందే.. ఇలాంటి వృత్తిని బాధ్యతగా ఆడవారు నిర్వహిస్తున్నారంటే ఒక రకంగా మెచ్చుకోవలసిన విషయమే.. ఇకపోతే పౌరోహిత్యం అనేది కూడా చాలా పవిత్రమైన పని.. ఈ అదృష్టం అందరికి రాదు.. సమాజంలో జీవించే ప్రతివారిలో దైవానికి నిత్యం దగ్గరగా ఉండేవారు ఎవరంటే గుడిలో నిత్యం దేవున్ని అర్చించే పూజారులని చెబుతారు.. ఇదెంత పుణ్యమైన కార్యమో అని చాలా సార్లు అనిపిస్తుంది.

 

 

ఇక ఇలాంటి వారి చిత్తం, బుద్ధి ఎంత పవిత్రంగా ఉండాలో తెలిసిందే. గుడికి వచ్చే ప్రతివారి పట్ల మాతృభావన కలిగి ప్రవర్తించాలి.. కాని నేటికాలంలో.. మంచిని మట్టిలో కప్పిపెట్టి ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు.. ఇందుకు ఉదాహరణ వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ఎస్సై పట్ల ఓ పురోహితుడు ప్రవర్తించిన తీరు నిజంగా సమాజంలోని చెడును కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

శుక్రవారం ఉదయం హన్మకొండలోని వేయి స్థంభాల దేవాలయ ప్రాంగణంలో ఉదయం నుంచి విధులు నిర్వర్తిస్తు.. భక్తులకు, వారి రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా విధుల్లో నిమగ్నమైన ఓ మహిళ ఎస్సై కొంత సమయానికి దేవుడి దర్మనం చేసుకుని ప్రసాదం తింటున్నది. ఆ సమయంలో దేవాలయంలో పూజాకార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చిన సందీప్ శర్మ అనే పురోహితుడు మహిళా ఎస్సై వద్దకు వెళ్లి తనకు అవసరం లేకున్నా కలుగజేసుకుని మహిళా ఎస్సైని తాకుతూ, అసభ్యంగా ప్రవర్తించాడట..

 

 

ఈ విషయాన్ని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ మహిళా ఎస్సై తీవ్ర మనోవేదనకు గురై భక్తుల మధ్యలో నుంచి గుడి బయటకు వచ్చి అక్కడ విధుల్లో ఉన్న ఉన్నతాధికారులకు తెలుపడంతో, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని వారు ఆదేశించారు. మహిళా ఎస్సై నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా పురోహితుడు సందీప్ శర్మ పై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు చెప్పుతున్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: