రాజకీయాల్లో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానిదీ కీలక బాధ్యతే. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపించడం ఆ పార్టీ బాధ్యత. అయితే మన ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రభుత్వాన్ని అడ్డగోలుగా విమర్శించడం ఒక్కటే పని అన్నట్టు వ్యవహరి స్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు పార్టీ కూడా అదే పని చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైనా ఒక వార్త వస్తే చాలు. ఇక దాన్ని పట్టుకుని ఆ పార్టీ నానా యాగీ చేస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ విశాఖ మిలీనియం టవర్స్ వ్యవహారం.

 

millennium towers <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VISAKHAPATNAM' target='_blank' title='vizag-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>vizag</a> కోసం చిత్ర ఫలితం

 

జగన్ రాజధానిని విశాఖకు మార్చాలని ప్రయత్నిస్తున్న సంగతి నిజమే. అందుకు అనుగుణంగా అక్కడ సచివాలయం పెట్టేందుకు అనువైన భవనాల కోసం అన్వేషణ సాగుతోంది. అయితే విశాఖలో ఇప్పటికే అందుబాటులో ఉన్న మిలీనియం టవర్స్ లో సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలు తొలి నుంచి ఉన్నాయి. ఇటీవల దీని అభివృద్ధి కోసం జగన్ సర్కారు నిధులు కూడా విడుదల చేసింది. అయితే.. అనూహ్యంగా ఈ ప్రతిపాదనకు విశాఖలోని నేవీ అధికారులు ఒప్పుకోవడం లేదని ఓ ఆంగ్ల పత్రికలో వార్త వచ్చింది. ఇక ఆ పత్రిక వార్తాకథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు రోజంతా విమర్శలు చేశారు.

 

vizag navy head కోసం చిత్ర ఫలితం

 

పాపం.. ఇంగ్లీషు పత్రికలో వచ్చింది కదా నిజమే అయ్యుంటుంది అనుకున్నారు. కానీ ఇంత పరపతి ఉన్న తెలుగుదేశం దేశాధినేత ఆ వార్తలో నిజమెంత ఉందో అన్న పరిశీలన చేయలేదు. తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. కానీ.. రోజంతా టీడీపీ నేతలు విమర్శించిన తర్వాత..అనూహ్యం నావికాదళం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఆంగ్లపత్రికలో వచ్చిన కథనం అంతా అవాస్తవం అని ఆ ప్రకటనలో తెలిపింది. దీంతో ఆ పత్రిక పరువుతో పాటు.. దాని ఆధారంగా రోజంతా విమర్శించిన టీడీపీ పరువు కూడా పోయింది. ఇటీవల టీడీపీకి కియా పరిశ్రమ విషయంలోనూ ఇదే జరిగింది. రాయటర్స్‌ ఏదో కథనం రాయగానే టీడీపీ రెచ్చిపోయి మీడియాలో విమర్శలు గుప్పించింది. ఆ తర్వాత ఏకంగా ఆ పరిశ్రమ యాజమాన్యమే దాన్ని ఖండించింది. పాపం.. టీడీపీకి ఈ ఎదురు దెబ్బలేంటో..?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: