కరోనా వైరస్... ఇపుడు దీని పరిచయం అక్కర్లేదేమో. ఇపుడు అదే వైరస్ దేశ దేశాలను రక రకాలుగా ఇబ్బంది పెడుతోంది.. ఆరోగ్య పరంగా, ఆహారం పరంగా, వాణిజ్య పరంగా.. ఇంకా ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇపుడు అదే.. అమెరికా - రష్యాల మధ్య కోల్డ్ వార్ కి కారణభూత మౌతోంది.  అవును.. కరోనా విషయంలో రష్యా తమపైన దుష్ప్రచారం చేస్తోందని అమెరికా మండిపడుతోంది. 

 

 

రష్యాతో సంబంధం ఉన్న వేలాది సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఉద్దేశపూర్వకంగా వైరస్‌పై ప్రచారం చేస్తూ ప్రపంచ దేశాల ప్రయత్నాలకు గండి కొడుతుందని, అమెరికా అధికారులు పేర్కొన్నారు. తమ ప్రతిష్ఠను దెబ్బకొట్టేందుకు కోవిడ్ వైరస్ వ్యాప్తి వెనుక అమెరికా కుట్ర ఉందని పేర్కొంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దుష్ప్రచారం సాగిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. 

 

రష్యా ఉద్దేశపూర్వకంగా అమెరికా సంస్థలు, కూటమిని నిర్వీర్యం చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తోందని అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఫిలిఫ్ రీకేర్ తెలిపారు. ప్రజా భద్రత కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారం ద్వారా మరోసారి రష్యన్ ఆగంతకులు ప్రపంచ ఆరోగ్య ప్రతిస్పందన నుంచి దృష్టి మరల్చి ప్రజల భద్రతకు ముప్పు తెచ్చిపెడుతున్నాని అన్నారు. చైనాతో వాణిజ్య యుద్ధంలో భాగంగా జీవాయుధాలను అమెరికా ప్రయోగించి, వైరస్ వ్యాప్తికి కారణమైందని సోషల్ మీడియాలో పలువురు పోస్ట్‌లు పెడుతున్నారు. 

 

 

అలాగే రష్యా అధికారిక మీడియా సైతం పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా జనవరి 20 తర్వాత సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టిందని, అమెరికా అధికారులు పేర్కొన్నారు.  ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ తీవ్రతరం కాలేదు, కాబట్టి అమెరికా, చైనా మధ్య అసమ్మతిని రాజేయడానికి రష్యా ప్రయత్నిస్తోందని, ఆర్థిక ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చాలా సమర్థవంతంగా చేస్తోందని అంతా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: