అమెరికా అధ్యక్షుడు రెండు రోజుల పర్యటన కోసం ఇండియా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనకు మోడీ సర్కారు చేస్తున్న హడావిడి విమర్శల పాలవుతోంది. ట్రంప్ రెండు రోజుల పర్యటన కోసం మోడీ సర్కారు డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.

 

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనకు గాను కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఇంత భారీ మొత్తాన్ని ఈ పర్యటనకోసం ఖర్చు చేయడం అవసరమా అని ఆమె ప్రశ్నించారు. ఈ డబ్బు ను ఒక కమిటీ ద్వారా ఖర్చు చేస్తున్నట్లు అంటున్నారని, కాని నిజానికి అసలు కమిటీ సభ్యులకే తాము సభ్యులం అన్న విషయం తెలియదని ఆమె విమర్శించారు.

 

trump <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> visit కోసం చిత్ర ఫలితం

 

ట్రంప్ పర్యటనలో భారీగా ధన దుర్వినియోగం చేస్తున్నారని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ట్రంప్ డిల్లీ,అహ్మదాబాద్ , అగ్రాలలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ఢిల్లీ పర్యటనపై కూడా వివాదం మొదలైంది. డిల్లీలో ఒక ప్రభుత్వ స్కూల్ ను సందర్శించడానికి అమెరికా అద్యక్షుడు ట్రంప్ కుమార్తె మెలోనియా ట్రంప్ వస్తున్నారు.ఈ కార్యక్రమానికి డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కాని, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కాని ఆహ్వానం అందకపోవడం వివాదాస్పదం అయింది.

 

 

 

కేంద్ర ప్రభుత్వం కావాలనే ఢిల్లీ సీఎంను పక్కనపెట్టిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దురుద్దేశంతోనే సీఎం కేజ్రీవాల్ పేరును జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆప్‌ ఆరోపించింది. మెలానియా ట్రంప్‌ కార్యక్రమానికి తమ సీఎంను ఆహ్వానించనప్పటికీ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే కేజ్రీవాల్‌ గురించి చెబుతాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: