పెళ్లి అనేది ఒక నమ్మకం మీద సాగే ప్రయాణం.. బ్రతికినంత కాలం ఒకరికొకరు తోడు నీడలా కలిసి ఉండేలా సమాజంలో ఏర్పడిన బంధం.. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది తమజీవితాలను అర్ధం లేని ఆశలతో నాశనం చేసుకుంటున్నారు.. అక్రమ సంబందాల మాయలో పడి కట్టుకున్న వాళ్ల పాలిట శాపంలా మారుతున్నారు..

 

 

ఇకపోతే అందమైన పెళ్లాం ఉంటే ఎవరైన అపురూపంగా చూసుకుంటారు. కాని ఇక్కడొక రాజకీయ నాయకుడు మాత్రం, ఈ అందాన్ని కాదని ఓ ఆంటీని తగిలించుకున్నాడు. అంతటితో ఊరుకోకుండా ఏకంగా ఇంటికే తెచ్చుకుని సరసాల్లో మునిగి తేలుతున్నాడట.. చెన్నైలోని అడయార్ ఇందిరానగర్ కు చెందిన రమ్యకు వడియంబాడికి చెందిన సారధికుమార్ తో 2016లో వివాహం అయ్యింది. సారధి కుమార్ వడియంబాడి నగర డీఎంకే కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

 

 

ఈ క్రమంలో ఇతనికి సేలంకు చెందిన ఒక ఆంటీతో పరిచయం ఏర్పడిందట. ఆ మహిళ, ఇతనికి కంటే 15 ఏళ్లు పెద్దది.... అయినా సారధికుమార్ ఆమె మోజులో పడిపోయాడట. అంతే కాకుండా  ఆ ఆంటీ మోజులో పడిన సారధి కుమార్ రమ్యకు చెందిన 14 సవర్ల బంగారు నగలు తాకట్టు పెట్టగా వచ్చిన నగదుతో పాటుగా, తండ్రి తన పేరున రాసిన ఆస్తిని కూడా అమ్మి ఆంటీకి సమర్పించాడని కన్నీళ్లు పెట్టుకుంది  రమ్య. అదేమని ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరించాడట..

 

 

అంతటితో ఊరుకోని సారధి కుమార్ మీద ఫిబ్రవరి 19 న స్ధానిక అరివాలయం పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేసి రమ్య ఇంటికి తిరిగి వస్తుండగా, మధ్యలో అడ్డగించి తన మెడపై కత్తి పెట్టి ఫిర్యాదు వెనక్కి తీసుకోక పోతే చంపేస్తానని కూడా బెదిరించాడని, తన అత్తగారు కూడా భర్తనే సపోర్టు చేస్తోందని, అందువల్ల తన భర్త నుంచి ప్రాణహాని ఉందని...తనకు  రక్షణ కల్పించి న్యాయం చేయాలని రమ్య పోలీసు కమీషనర్ ను కోరింది. డీఎంకే నేత అరాచకాలు తెలుసుకున్న కమీషనర్,  కేసు నమోదు చేసివిచారణ చేయాలని స్ధానిక పోలీసులను ఆదేశించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: