కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చి ఎన్నిరోజులు అయినప్పటికీ ఇప్పటికి ఈ చట్టం పై నిరసనలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికి ఎంతో మంది రాజకీయ నాయకులు పౌరసత్వ సవరణ చట్టం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఎంతో మంది ప్రజలు కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు చేస్తూనే ఉన్నారు. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా ఎన్ని నిరసనలు జరిగినప్పటికీ ఎన్ని ఆందోళనలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పౌరసత్వ సవరణ చట్టం పై వెనక్కి తగ్గేది లేదంటూ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. 

 

 

 ఇక  దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం పై నిరసన సెగలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో ఏకంగా వెయ్యి మంది మహిళలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రోడ్డు మీదికి చేరి నిరసన తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం.. పౌరసత్వ జాబితాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. మహిళలు . చేతిలో జాతీయ జెండాలను పట్టుకున్న మహిళలు ఆజాద్ అంటూ  నినాదాలు కూడా చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని  రోడ్డుపై బైఠాయించారు. ఇక వెయ్యి మంది మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్  స్తంభించిపోయింది. 

 

 

 అయితే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మహిళలను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. కాగా షాహీన్ భాగ్  అల్లర్లపై దేశ అత్యున్నత న్యాయ స్థానం  స్పందించింది.  వారితో చర్చలు జరపాలి అంటూ ప్రభుత్వాన్ని కోరింది దేశ అత్యున్నత న్యాయస్థానం. అయితే నిరసన తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు అని తెలిపిన సుప్రీం కోర్టు రోడ్డు బ్లాక్ బ్లాక్ చేసి నిరసన తెలిపవద్దంటూ సూచించింది. అయితే సుప్రీంకోర్టు కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మరోసారి మహిళలు భారీ మొత్తంలో జాఫ్రా బాద్ లో  ఆందోళనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: