ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ యువ ఎమ్మెల్యే రాజ‌కీయ ఆరంగ్రేటంతోనే సంచ‌ల‌నం క్రియేట్ చేశారు. ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీయే ఓ సంచ‌ల‌నం. నాటి నుంచి నేటి వ‌ర‌కు ఓట‌మి లేకుండా ఎన్నో సంచ‌ల‌నాల‌తో దూసుకు వెళుతూ నేడు జాతీయ స్థాయిలోనే ఉత్త‌మ ఆద‌ర్శ యువ శాస‌న‌స‌భ్యుడిగా ఎంపికై జాతీయ స్థాయిలో ప్రశంస‌లు అందుకుంటున్నారు. ఇంత‌కు ఆ యువ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు. ప్ర‌కాశం ప‌ర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు.



ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లోకి 2013లో ఓ యువ‌కెర‌టంలా దూసుకు వ‌చ్చిన ఏలూరి అతి చిన్న వ‌య‌స్సులోనే ఉత్త‌మ పారిశ్రామిక‌వేత్త‌గా ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. 2013 స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అప్ప‌టి కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ అల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన ఏలూరి ఆ త‌ర్వాత 2014లో తొలి ప్ర‌య‌త్నంలోనే ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఐదేళ్ల పాల‌న‌లో ఏలూరి వినూత్న‌మైన ఎమ్మెల్యేగా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిలో త‌న‌దైన ముద్ర వేశారు.



ఇక ఆయ‌న అభివృద్ధి ప‌థ‌కాలు, ఆయ‌న వ్య‌క్తిత్వ‌మే పార్టీల‌తో సంబంధం లేకుండా ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ తెచ్చిపెట్టాయి. అందుకే గ‌త యేడాది ఎన్నిక‌ల్లో మ‌హామ‌హులు ఓడిపోయినా ప‌ర్చూరులో మాత్రం ఏలూరి దిగ్గ‌జ నేత ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌రావును ఓడించి తెలుగు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపారు. తాజాగా ఏలూరి సాంబశివరావుకు ప్రతిష్టాత్మక జాతీయ ఆదర్శ యువ శానససభ్యుడి పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును ఏలూరి ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు.



అవార్డు తీసుకుంటున్న సమయంలోనూ అమరావతి నినాదాన్ని సాంబశివరావు వినిపించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేసిన తర్వాత అవార్డును తీసుకున్నారు. ఏదేమైనా దేశ‌వ్యాప్తంగా కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఏలూరి పాల‌న‌, ప‌రుచూరు ప్ర‌గ‌తిని గుర్తించి ఆయ‌న్ను ఈ అవార్డుకు ఎంపిక చేసుకున్నారు. అందుకే ఏలూరి ప్రతిష్టాత్మకమైన జాతీయ ఆదర్శ యువ శానససభ్యుడి పురస్కారానికి ఎంపికయ్యారు.



ద‌క్షిణ భార‌త‌దేశం నుంచి ఈ అవార్డుకు ఎంపికైన ఏకైక ఎమ్మెల్యే ఆయ‌నే కావ‌డం విశేషం. ఎమ్‌.ఐ.టీ వరల్డ్‌ పీస్‌ యూనివర్సిటీ, భారత స్టూడెంట్‌ పార్లమెంట్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందజేశారు. ఇక ఈ అవార్డు అందుకున్న ఏలూరికి రెండు తెలుగు రాజ‌కీయ నేత‌ల నుంచి పార్టీల‌కు అతీతంగా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: