కరోనా వైరస్‌.. చైనాలో పుట్టి ప్రపంచాన్ని పట్టుకు పీడిస్తున్న ప్రాణాంతక మహమ్మారి. ఇప్పుడీ అంటువ్యాధి మనుషుల్నేగాక.. దేశాల ఆర్థిక వ్యవస్థల్నీ కబళించేస్తున్నది. గ్లోబల్‌ ఎకానమీకి తయారీ కేంద్రంగా విరాజిల్లుతున్న చైనా.. ప్రస్తుతం కరోనా (కోవిడ్‌-19) పడగ నీడలో బిక్కుబిక్కుమంటున్నది. ఈ పరిణామం భారత్‌సహా ప్రపంచ వృద్ధి చోదక దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తుండగా, అంతర్జాతీయ వృద్ధిరేటు ప్రమాదంలో పడింది. టీవీ కొనాల‌నుకునే వారికి షాకింగ్ న్యూస్ ఇచ్చింది.

 

ఔను. అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల కార‌ణంగా మ‌నం ఎలా ఇబ్బంది ప‌డ‌తామో తెలిపే సంద‌ర్భం ఇది. భారతీయ టెలివిజన్‌ మార్కెట్‌ అత్యధికంగా చైనా దిగుమతులపైనే ఆధారపడి నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఇప్పుడు మరణ మృదంగం మోగిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా పడుతోంది. కరోనా దెబ్బకు చైనా ఉత్పాదక రంగాన్ని కమ్మేసిన నిస్తేజం.. ఓపెన్‌ సెల్‌ టెలివిజన్‌ ప్యానెల్స్‌ సరఫరాకు అంతరాయాన్ని కలిగిస్తుంద‌ని స‌మాచారం.

 


తాజా ప‌రిణామాల ప్ర‌కారం, టీవీల ధరలు పెరుగనున్నాయి. ఎందుకంటే, భారత్‌కు దిగుమతి అవుతున్న ఓపెన్‌ సెల్‌ టెలివిజన్‌ ప్యానెల్స్‌లో చైనా నుంచే ఎక్కువగా వస్తున్నాయి. టెలివిజన్ల తయారీలో వీటి పాత్ర కీలకం. దీంతో చైనా నుంచి ఆగిన సరఫరా.. దేశీయంగా టీవీల తయారీకి ఆటంకం కలిగిస్తున్నది. మార్కెట్‌ డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేక అందుబాటులో ఉన్న ప్యానెల్స్‌ ధరలు పెరిగిపోయే వీలుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో టీవీల ధరలూ పెరుగుతాయంటున్నారు. ఈ ప్యానెల్స్‌.. టీవీ ధరలో దాదాపు 60 శాతంగా ఉండటం గమనార్హం. అయితే చైనాలో కొన్ని కర్మాగారాలు తిరిగి తెరుచుకున్నా.. పరిమిత స్థాయి కార్మికులతోనే నడుస్తున్నాయి. దీంతో ఉత్పత్తి ఆశించిన స్థాయిలో జరుగడం లేదని, వీటివల్ల మార్కెట్‌లో ప్యానెల్‌ ధర దాదాపు 20 శాతం పెరుగవచ్చని పరిశ్రమ అంచనా వేస్తున్నది. ఈ క్రమంలో మార్చిలో కనీసం టీవీల ధరలు 10 శాతమైనా పెరుగడం ఖాయమని ఎస్‌పీపీఎల్‌   సీఈవో అవ్నీత్‌ సింగ్‌ మర్వా అన్నారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల దృష్ట్యా 30-50 శాతం వరకు ఉత్పత్తి పడిపోయే వీలుందని కూడా చెప్పారు. హైయర్‌ ఇండియా అధ్యక్షుడు ఎరిక్‌ బ్రగాంజా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

కాగా, 

మరింత సమాచారం తెలుసుకోండి: