ఇటీవల సోషల్ మీడియాలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై తప్పుడు జరుగుతోందని, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి గారు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారంపైన ఆదివారం ఆయన మీడియాతో చర్చిస్తూ.. జాతీయ భద్రతా సలహాదారు అజిద్ దోవల్ పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి, టీడీటీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా వాపోయారు. 

 

 

కాగా, టీటీడీ.. కోట్ల సొమ్మును ప్రభుత్వ ట్రెజరీకి మళ్లించిందని సోషల్ మీడియాలో ఓ వార్త, తెగ వైరల్ అవుతోంది. కేంద్ర మంత్రి అజిత్ దోవల్ అకౌంట్ తో, ఈ వార్త సర్క్యులేట్ అవడం ఇపుడు కలకలం రేపుతోంది. అయితే, టీటీడీపై ట్విట్టర్‌లో పోస్టులు చేసింది.. అజిత్‌ దోవల్‌ కాదని, అది ఫేక్‌ అకౌంట్‌ అని వైవీ సుబ్బారెడ్డి గారు చెప్పడం గమనార్హం. టీటీడీకి చెందిన రూ.2,300 కోట్లను ప్రభుత్వ ట్రెజరీకి బదలాయిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని.. ఇది చాలా దారుణమని ఆయన చాలా తీవ్రంగా మండి పడ్డారు. 

 

అయితే, ఇలాంటి వార్తలను ప్రజలు విస్మరించరని, వారికి నిజానిజాలేంటో తెలుసనీ.. వారు ఇలాంటి భూటకపు మాటలు నమ్మరని, పైన వున్న వేంకటేశుడు అంతా గమనిస్తున్నాడని, పాపులకు శిక్ష తప్పదని ఈ సందర్భంగా అయన తన ఆవేదనను వెళ్లగక్కారు. ఇది దేవుడు సొమ్ము అని, మనకు ఇష్టం వచ్చినట్లు వాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కేవలం భక్తుల కోసం మాత్రమే ఆ డబ్బును వినియోగించాలన్నారు. 

 

 

ఇలాంటి వాటివి కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం చాలా అవనీయమని అన్నారు. రాజకీయంగా ఎన్ని అయినా చేసుకోవచ్చని, అయితే వారి వారి ప్రయోజనాలకోసం దేవుడిపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలాగే టీటీడీకి త్వరలో సైబర్ క్రైమ్ విభాగం ఏర్పాటు చేస్తామని 
కూడా ఈ సందర్భంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: