ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో జరిగిన ఈఎస్‌ఐ కుంభకోణం బయట పడటం పెను సంచలనంగా మారింది. గత ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఈ భారీ కుంభకోణం జరిగినట్లు పూర్తి ఆధారాలతో లభ్యమైంది. దీంతో కేసు నుండి తప్పించుకోవడం కోసం బీసీలు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈఎస్‌ఐ కుంభకోణం టాపిక్ డైవర్ట్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తాజాగా అచ్చం నాయుడు పై వచ్చిన వార్తల విషయంలో వైసీపీ నాయకులు ప్రతిస్పందిస్తారు. ఇదే సమయంలో ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ..చంద్రబాబు అచ్చెన్నాయుడు ఎన్ని డ్రామాలు కుయుక్తులు పన్నినా ఈఎస్‌ఐ కుంభకోణం నుండి తప్పించుకోవటం కష్టమని ఈ కుంభకోణంలో బీసీ కార్మికులను కూడా డార్లింగ్ గా మోసం చేశారని దోచుకున్నారని చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 

జరిగిన అక్రమాలపై చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ విచారణ కు ఆదేశించామని తెలిపారు. అచ్చెన్నాయుడు అవినీతి చేశాడు అనటానికి బయటపడిన లెటర్ సాక్ష్యం అని తెలిపారు. కచ్చితంగా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి మొత్తం బయటపెడతామని అక్రమంగా సంపాదించిన సొమ్మును రికవరీ చేస్తామని అచ్చెన్నాయుడు జైలుకి వెళ్లడం పక్క అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అచ్చెన్నాయుడు కి ఎర్త్ పెట్టే విధంగా ఈ కేసు విషయంలో సీఎం జగన్ స్పెషల్ దృష్టి పెట్టినట్లు సమాచారం.

 

ఈ నేపథ్యంలో ఈఎస్ఐ కుంభకోణం విషయంలో దోషులు తప్పించుకోకుండా పక్కా ప్రణాళికతో పకడ్బందీగా పట్టుకునే నైపుణ్యం కలిగిన నార్త్ ఇండియాలో ఒక ఆఫీసర్ ని ఈ కేసుని టేకప్ చేయించడానికి జగన్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే చంద్రబాబు ప్రియమైన శిష్యుడు అచ్చెన్నాయుడు కి ఎర్త్ గట్టిగానే జగన్ పెట్టినట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: