తాజాగా సంచలనం సృష్టిస్తున్న వెయ్యి కోట్ల రూపాయల  ఇఎస్ఐ స్కాంలో  దివంగత నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పుణ్యం కట్టుకున్నట్లే ఉంది చూస్తుంటే. స్కాంలోని ముఖ్యమైన పాయింట్లేమిటంటే ఎక్సపెయిరీ డేట్ కు దగ్గరలో ఉన్న మందులను కొనటం, రేట్ కాంట్రాక్టులో లేని ఫార్మా కంపెనీల నుండి మందులు కొనటం, నాసిరకం మందుల కొనుగోలు, చెల్లించాల్సిన బిల్లులకన్నా కొన్ని రెట్లు ఎక్కువగా డబ్బులు చెల్లించటం లాంటివి చాలా ఉన్నాయి లేండి.

 

ఇటువంటి సకల దరిద్రాలకు నిలయం కోడెల అనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఎలాగంటే కోడెల స్పీకర్ అవ్వగానే ఆయన కూతురు డాక్టర్ విజయలక్ష్మికి ఒక్కసారిగా వివిఐపి స్ధాయి వచ్చేసింది. చాలా ఫార్మాకంపెనీల్లో ఆమెను డైరెక్టరుగా పెట్టుకునేందుకు యాజమాన్యాలు పోటి పడ్డాయట. కేవలం ఓ మామూలు డాక్టర్ గా ఉన్న విజయలక్ష్మిని ఫార్మా కంపెనీలు డైరెక్టరుగా పెట్టుకోవటానికి ఎందుకు  పోటి పడ్డాయి ?

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  ఫార్మాకంపెనీలే ఆమెను డైరెక్టరుగా పెట్టుకున్నయో ? లేకపోతే తన పలుకుబడిని ఉపయోగించి తనను డైరెక్టరుగా పెట్టుకునేట్లు ఆమె యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చిందో తెలీదు. మొత్తానికి ఏదైనా కానీండి ఆమె మాత్రం చాలా కంపెనీల్లో డైరెక్టరుగా ఉన్నది వాస్తవం. ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రులపై ఒత్తిడి తెచ్చి తమ పనులు చేసి పెట్టటానికే.

 

ఇందులో భాగంగానే ఆరోగ్యశాఖ, కార్మికశాఖల మంత్రులుగా పనిచేసిన వారిపై కోడెల ఒత్తిడి తెచ్చి  ఫార్మాకంపెనీల నుండి వందల కోట్ల రూపాయల నాసిరకం మందులు, కాలం చెల్లిపోతున్న మందులను పెద్ద ఎత్తున కొనిపించినట్లు ఇపుడు అర్ధమవుతోంది.  కోడెల బతికున్నపుడే ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పట్లో ఇఎస్ఐ స్కాం బయటపడలేదు కాబట్టి కోడల భాగోతం బయటపడలేదు.  తాజాగా బయటపడిన స్కాంతో కోడెల ఒత్తిడి, విజయలక్ష్మి నిర్వాకాలు అన్నీ బయటపడుతున్నాయి. నిజంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని ఏ స్ధాయిలో దోచేసుకున్నారో పచ్చనేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: