ఫిలింఫేర్ -2020 అవార్డులపై విమర్శలు కురుస్తూనే ఉన్నాయి. గల్లీబాయ్ సినిమా పలువిభాగాల్లో అవార్డులను ఖాతాలో వేసుకుంది. దీనిపై విమర్శలు  వెల్లువెత్తాయి. వీటికన్నా కేసరి సినిమా చాలా బాగుందని.. అది పిల్మ్‌ఫేర్ నిర్వాహకులకు పట్టలేదని అక్షయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ తరుణంలో తొలిసారి అవార్డు పొందిన తాప్సీ.. ఫిలిం ఫేర్ వివాదంపైనా స్పందించారు.  

 

గల్లీబాయ్ క్రేజ్‌... ఫిలింఫేర్‌ అవార్డులను ఊపేసింది. హీరో, హీరోయిన్, బెస్ట్ లిరిక్స్ సహా పలు విభాగాల్లో ఈ చిత్రం అవార్డుల పంట పండించింది. గల్లీబాయ్ కన్నా పలు సినిమాలు బాగున్నాయని.. వాటిని ఎవరూ పట్టించుకోలేదని ట్వీట్‌ విమర్శలు వెల్లువెత్తాయి. ఈతరుణంలో చారిత్రక నేపథ్యంలో తీసిన కేసరి సినిమా ఎందులో తక్కువని.. అవార్డుల విషయంలో చిన్నచూపు చూశారని అక్షయ్ అభిమానులు ట్వీట్ వార్ సాగించారు.

 

ఫిబ్రవరిలో నిర్వహించిన ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో.. శాండ్ ఖీ అంఖ్‌ చిత్రానికి గాను తాప్సీ, భూమి ఫడ్నేకర్‌... ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డులపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలపై తాప్సీ తనదైన శైలిలో స్పందించారు. 2016 నుంచి అవార్డులు వస్తే ఎలా స్పీచ్ ఇవ్వాలి అన్న అంశంపై ఆలోచించేదాన్నని.. ఈ సారి అలాంటి ఆలోచన చేయలేదంది తాప్సీ. నాలుగేళ్లుగా స్టేజ్‌పై మాట్లాడే అవకాశం రాలేదన్న ఈ ముద్దుగుమ్మ.... ఈ సారి ఎలాంటి స్పీచ్ సిద్ధం చేసుకోలేదంది. కానీ స్టేజ్‌పై మాట్లాడాల్సి వచ్చిందని తెలిపింది. అవార్డు  గెల్చుకోవడానికి ఇన్నేళ్లు సమయం పట్టినా.. అవార్డు రావడం సంతోషంగా ఉందంది తాప్సీ. ఇంతకు మించి ఏం చెప్పగలను అని తాప్సీ తెలిపింది.

 

ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ కాంట్రవర్సీ గురించి మాట్లాడిన తాప్సీ.. తాను ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీలో ఉండేదాన్నని తెలిపింది. కానీ ఈ సారీ కాంట్రవర్సీలో తనపేరు లేకపోవడం బాగుందని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఏడాది ఫిలింఫేర్‌ అవార్డుకు నేను అర్హురాలినేనని చాలామంది నమ్ముతున్నారు. దానికి నేనేంతో సంతోషిస్తున్నాను అని తాప్సీ తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: