అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి పెద్దన్న లాంటి ట్రంప్ భారత్లో పర్యటిస్తుండటం ఎంతో  ఆసక్తిని సంతరించుకున్న విషయం తెలుస్తుంది. మొదటిసారి ట్రంప్ భారత్లో పర్యటిస్తుండడంతో... భారతదేశం మొత్తం ట్రంపు పర్యటనపై ఎంతో ఆసక్తిని కనబరుస్తోంది. ముఖ్యంగా ట్రంప్  పర్యటన కోసం మోదీ సర్కార్ 500 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  అంతేకాకుండా భారతదేశ గొప్పతనాన్ని తెలియపరచేలా ఎన్నో ఏర్పాట్లు చేస్తోంది మోదీ  సర్కార్ . ఈ నేపథ్యంలో ట్రంపు కూడా ఇండియా కు సంబంధించి ఎన్నో కామెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. కామెంట్స్ అన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. 

 


 దేశ ప్రధాని నరేంద్ర మోడీ మంచోడే కానీ ఇండియా మంచిది కాదు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం... అంతే కాకుండా ఇండియా ప్రభుత్వం మంచిది కాదు అన్నట్లుగా  పలు చేస్తున్నారు.. ఇలాంటి వ్యాఖ్యలు  చేయడం ద్వారా... భారతీయులందరిని మానసికంగా ఒక దారిలోకి తీసుకురావాలనే భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉదాహరణకు..క్రికెట్  మీ దేశ ఆటగాళ్లు ఏమి ఆడ లేరు.. మా దేశం ఆటగాళ్లు చాలా గొప్ప.. వాళ్ల ముందు మీ ఆటగాళ్లు నిలవలేరు..లాంటి కామెంట్స్  క్రికెట్ లో కొంత మంది వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇండియా పర్యటన నేపథ్యంలో ట్రంపు వ్యాఖ్యలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

 


 ఇండియా పై పలు విమర్శలు చేస్తూనే మోదీ ని పొగుడుతూ ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ నేపథ్యంలో.. భారతీయులందరికీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యేలా చేసి  ట్రంప్ ఇండియా పర్యటనకు వస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే తన వ్యాఖ్యలతో భారతీయులందరి మైండ్ ని డైవర్ట్ చేసి.. ఇండియా పర్యటనలో ఏదో ఒక సంస్థను స్థాపిస్తే  భారతీయులందరూ  ట్రంప్  అంటే గొప్ప వ్యక్తి అన్నట్లుగా భావిస్తారు అని అనుకొని ట్రంప్  ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే  ప్రపంచానికి పెద్దన్న అయినా ట్రంప్  పర్యటన మోడీ సర్కార్  ఎలా ఉపయోగించుకుంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: