2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ మెజారిటీతో సొంతం చేసుకొని ఘన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. టిడిపి పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే ఇంకొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వస్తున్న మొదటి ఎన్నికలు కావడంతో ప్రస్తుతం ఎన్నికలు  ఆసక్తిని  సంతరించుకున్నాయి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన టిడిపి పార్టీ ఈసారి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుదలతో ఉండగా...  అటు వైసిపి పార్టీ తమ తమ గెలిపిస్తాయి అనేది ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 

 


 అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ముఖ్యంగా జగన్మోహన్రెడ్డి సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం అయినా మధ్య నిషేధం పై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్యం నిషేధం పై వివిధ సభల్లో  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి రాత్రి కాసింత మందు తాగుదామంటే.. మద్యం ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని... పెరిగిన ధరలు జగన్ టాక్స్ అంటూ వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చంద్రబాబు దీనిపైనే  ప్రచారం చేయనున్నట్టు సమాచారం. అయితే అటు వైసీపీ సర్కార్ మాత్రం తాము ప్రవేశపెట్టిన మద్యనిషేధం ద్వారా ప్రజలు ఆనందంగానే ఉన్నట్లు భావిస్తోంది. 

 

 ఎన్ని  విమర్శలు వచ్చిన దశలవారీగా మద్యం నిషేధం చేస్తూ వస్తోంది జగన్ సర్కార్. ఇప్పటికే మద్యం షాపులను మద్యం సమయం వేళలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ త్వరలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది వారంలో నాలుగు రోజులు మాత్రమే మద్యం షాపులు పని చేసేలా  కీలక నిర్ణయం తీసుకోనుంది  జగన్ సర్కార్. అయితే జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న మద్యం నిషేధం పై ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలిపోనుంది. ఇదే అంశాన్ని అస్త్రం గా మార్చుకొని ప్రచారం చేసేందుకు టిడిపి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి మద్యం నిషేధం పై ప్రజలు ఏమంటున్నారు అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో  తేలిపోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: