అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన చేపడుతున్న తరుణంలో అంతర్జాతీయ మీడియా కన్ను మొత్తం భారత్ పై పడింది. అమెరికాలో ఇప్పటికే బయలుదేరిన డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24 ఉదయం చేరుకోనున్నారు. సతీసమేతంగా ఎయిర్‌ఫోర్స్‌ 1 విమానంలో ఆయన వాషింగ్టన్‌ డీసీ నుంచి పయనమయ్యారు. వారి వెంట కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ కూడా ఇండియా వస్తున్నారు. జర్మనీ మీదుగా వారు భారత్‌కు చేరుకుంటారు. ఫిబ్రవరి 24 ఉదయం 11.55 నిముషాలకు ట్రంప్‌ ఫ్యామిలీ అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడికి రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుతారు.

 

ఎయిర్‌పోర్టు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతేరా క్రికెట్‌ స్టేడియం వరకు ఇరు దేశాల అధినేతలు రోడ్‌ షోలో పాల్గొంటారు. లక్షలాది నమస్తే ట్రంప్‌ అంటూ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. ఇటువంటి సమయంలో అంతర్జాతీయ మీడియా మొత్తం ఇండియాలో ఉన్న తరుణంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ అడుగుపెడుతున్న గా మోడీ కి ఊహించని బ్రేకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేమిటంటే పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడంపై దేశ రాజధాని ఢిల్లీలో వెయ్యి మంది మహిళలు ధర్నా చేయడానికి రెడీ అయ్యారు.

 

చేతిలో జెండా లో పట్టుకొని ఆజాద్ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. సీఏఏను మోడీ సర్కార్ ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. ఆగ్రాలో కూడా డోనాల్డ్ ట్రంప్ పర్యటిస్తున్న తరుణంలో తాజాగా ఢిల్లీలో జరుగుతున్న ఈ గొడవలు పట్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ సర్కార్ పై రకరకాల వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంపు పర్యటన సమయంలో పౌరసత్వ సవరణ చట్టం గురించి మోడీని సూటిగా ప్రశ్నించడం కోసం రెడీ అవుతున్నారని అమెరికా మీడియా కూడా వార్తలు ప్రసారం చేసింది. ఇటువంటి సమయంలో మోడీ...ట్రంప్ బేటీ ఇప్పుడు అంతర్జాతీయ మీడియా పరంగా చాలా కీలకంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: