ఆకు వెళ్లి ముళ్లు మీద పడినా ముళ్లు వెళ్లి ఆకు మీద పడినా ఆకుకే నష్టం అనే సామెత తరచూ వింటూనే ఉంటాం. గతంలో ఈ సామెత చాలా సందర్భాల్లో ఆడపిల్లల విషయంలో చెప్పుకున్నా మైనర్ల ప్రేమల విషయంలో చూస్తే మాత్రం ఈ సామెత ఎక్కువగా మగవాళ్లకే వర్తిస్తుంది. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే గత కొన్ని నెలలుగా దేశంలో, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న మైనర్ ప్రేమల ఘటనల్లో, ఇతర ఘటనల్లో మైనర్ అబ్బాయిల జీవితాలే నాశమనవుతున్నాయి. 
 
ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్, టీవీలు, న్యూస్ ఛానెళ్ల ప్రభావంతో మైనర్లలో కూడా ప్రేమ, పెళ్లి, ఇతరత్రా విషయాల పట్ల ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. చాలా సినిమాలు చిన్నప్పటి ప్రేమలతో కూడిన కథలతో తెరకెక్కుతూ ఉండటం కూడా మైనర్లపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. మైనర్లలో స్నేహాలతో ప్రారంభమై ఆ స్నేహం ప్రేమగా మారి ఆ తరువాత ఇతర పరిణామాలకు దారి తీస్తోంది. 
 
18 సంవత్సరాలలోపు అమ్మాయిలు వారి ఇష్టంతో మరో మైనర్/ మేజర్ అబ్బాయిని వివాహం చేసుకున్నా ఆ అబ్బాయే జైలు పాలు అవుతాడు. ఉద్యోగాలు చేసే వారు వివాహం చేసుకుంటే ఉద్యోగాలు పోవడంతో పాటు శిక్షార్హులవుతారు. అమ్మాయి ఇష్టపడి వివాహం చేసుకున్నప్పటికీ అబ్బాయిలే సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అమ్మాయిలను మాత్రం వారి తల్లిదండ్రుల దగ్గరకు పంపడం లేదా వసతి గృహాల్లో ఉంచడం జరుగుతుంది. 
 
ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దిశ పోలీస్ స్టేషన్ లో పని చేసే హోం గార్డు, ఒక మైనర్ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ కేసులో అమ్మాయి మైనర్ కావడంతో అతడి హోం గార్డు ఉద్యోగం పోవడంతో పాటు అతని భవిష్యత్తు కూడా నాశనమయింది. 18 సంవత్సరాలలోపు అమ్మాయిలతో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం వలన వారి భవిష్యత్తు నాశనమవుతుందనే విషయాన్ని మైనర్/మేజర్ అబ్బాయిలు గుర్తుంచుకోవాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: