డోనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడి ప్రత్యేకతలే వేరు.. మిగిలిన వారిలా ఫక్తు రాజకీయ నాయకుడు కాదీయన. బిజినెస్ మేన్. అసలు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని ఎవరూ అనుకోలేదు. అనుకోకుండా బరిలో దిగిన ట్రంప్ అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. అమెరికా ఫస్ట్ నినాదంతో అమెరికన్లను ఆకట్టుకున్నాడు. ట్రంప్ భారత యాత్ర నేపథ్యంలో ట్రంప్ గురించిన విశేషాలు తెలుసుకుందాం.

 

డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ 1946 జూన్‌ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో పుట్టాడు. తండ్రి ఫ్రెడరిక్‌ ట్రంప్‌ స్థిరాస్తి వ్యాపారి. తల్లి మేరీ మెక్‌లీడ్‌ సామాజిక కార్యకర్త. ఐదుగురు సంతానంలో ట్రంప్‌ నాలుగోవాడు. చిన్నతనం నుంచి చురుగ్గా ఉండేవాడు. న్యూయార్క్‌ మిలిటరీ అకాడమీలో చేరాడు. తర్వాత ఫోర్దమ్‌, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నాడు.

 

donald <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DONALD TRUMP' target='_blank' title='trump-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>trump</a> assets కోసం చిత్ర ఫలితం

 

డోనాల్డ్ ట్రంప్ 1968లో అర్థ శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. తండ్రి మాదిరిగానే స్థిరాస్తి వ్యాపారంలో అడుగుపెట్టారు. అమెరికాతోపాటు, ఇతర దేశాలకు తన వ్యాపార సామ్రాజాన్ని విస్తరించారు. పుణెలోనూ ట్రంప్‌ కు రియల్ ఎస్టేట్ వెంచర్లున్నాయని మీకు తెలుసా.. ఆయన వ్యాపార సామ్రాజ్యంలో ద ట్రంప్‌ ఆర్గనైజేషన్‌, ట్రంప్‌ టవర్‌, అట్లాంటిక్‌ సిటీలో కాసినోలు, ద అప్రెంటిస్‌, మిస్‌ యూనివర్స్‌ టీవీ ఫ్రాంచైజీలు ముఖ్యమైనవి. జావిట్స్‌ సెంటర్‌, న్యూయార్క్‌లోని గ్రాండ్‌ హయత్‌ వంటి అతిపెద్ద హోటళ్లలోనూ ట్రంప్ కు పార్టనర్‌షిప్ ఉంది.

 

ఫ్లోరిడాలో అతిపెద్ద గోల్ఫ్‌కోర్స్‌ ఉంది. పామ్‌బీచ్‌లో ఎస్టేట్‌, బోయింగ్‌ 757 విమానం, ఎస్‌-76 హెలికాప్టర్‌, విలాసవంతమైన నౌక ఉన్నాయి. బంగారంతో చేసిన బైక్‌ కూడా ఉంది. ట్రంప్ ఏకంగా తన పేరుతో ఓ విశ్వవిద్యాలయాన్నే స్థాపించాడు. ట్రంప్‌ మొత్తం ఆస్తుల విలువ 310 కోట్ల డాలర్లు అని ఫోర్బ్స్‌ చెబుతోంది. కానీ ట్రంప్ ఆస్తి 800కోట్ల డాలర్లు అని మరో అంచనా. ట్రంప్ ఓ సక్సస్‌ఫుల్ వ్యాపారి. అందుకే తన విజయ సూత్రాలు వివరిస్తూ ఓ పుస్తకం కూడా రాశాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: