ఇప్పటి వరకూ అమెరికా ప్రెసిడెంట్స్ అయిన అందరిలోనూ డోనాల్డ్ ట్రంప్ అంత వివాదాస్పదుడు లేనే లేడని చరిత్ర చెబుతోంది. నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండటమే ఆయన విజయ సూత్రం ఏమో అనిపిస్తుంది. ఓవైపు రాజకీయ వివాదాలు. మరోవైపు విలాసాలు.. మరోవైపువిజయవంతమైన వ్యాపారవేత్త.. ఇలా భిన్న కోణాలు ఒకే వ్యక్తిలో ఉండటం చాలా అరుదు.

 

అసలు ట్రంప్ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు. పదవి లోకి రాగానే మెక్సికో సరిహద్దులో గోడ కడతానంటూ వివాదం లేవదీశాడు. అంతే కాదు.. ఈ నిర్మాణానికి నిధులు కూడా భారీగా కేటాయించేశాడు. ఇది పెద్ద వివాదం అయ్యింది. ఆ తర్వాత కొన్ని ముస్లిం దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించాడు. అప్పట్లో ఇది కూడా సంచలనమే.

 

trump disputes కోసం చిత్ర ఫలితం

 

 

ఆ తర్వాత పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాడు. తొక్కలో ప్రపంచం.. ముందు నా అమెరికా ప్రయోజనాలే ముఖ్యం అన్నది ట్రంప్ పాలసీ. ఆ తర్వాత ఒబామా తెచ్చిన ఆరోగ్య చట్టాన్ని నిర్వీర్యం చేసేశాడు. చైనాతో వాణిజ్యయుద్ధానికి తెర లేపేశాడు. అంతేనా.. ట్రాన్స్‌ పసిఫిక్‌ భాగస్వామ్యం నుంచి వైదొలగాడు. మరోవైపు ఉత్తర కొరియా అధినేత కిమ్‌తో భేటీ అయ్యాడు.

 

సిరియాపై దాడులు మళ్లీ ప్రారంభించాడు. జెరూసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించాడు. ఇలా ఒకటా రెండా ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయమూ వివాదస్పదమే అవుతున్నాయి. ఇక ఆయన నోటి దూల సంగతి అందరికీ తెలిసిందే. ట్రంప్‌ ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. మొత్తానికి ట్రంప్.. తన మాటలు, చేతలతో ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగానే ఉంటారు. అయితే విశేషం ఏంటంటే.. మీడియా అంటే ట్రంప్ కు అస్సలు పడదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: