అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్ వస్తున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ రోడ్‌ షోలో పాల్గొంటారు. మోతెరా స్టేడియం ప్రారంభిస్తారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ రక్షణ ఏర్పాట్లు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు అంటే మాటలు కాదు.. ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం అమెరికా. అత్యంత శక్తివంతమైన దేశం.

 

trump security detail కోసం చిత్ర ఫలితం

 

మరి అలాంటి దేశానికి అధ్యక్షుడు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఏమేం జాగ్రత్తలు తీసుకుంటారు. ఎలాంటి అధునాత పరికరాలు వాడతారు..ఓసారి చూద్దాం.. అమెరికా అధ్యక్షుడిగా పేరు, ప్రతిష్ఠలు ఏ స్థాయిలో ఉంటాయో ముప్పూ అదే స్థాయిలో ఉంటుంది. మరి అలాంటి నేతకు భద్రత కల్పించడం ఎలా? అమెరికా అధికార యంత్రాంగం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది? విదేశీ పర్యటనల సమయంలో ఏం చేస్తుంది? చూద్దాం.

 

trump security detail కోసం చిత్ర ఫలితం

 

అమెరికా అధ్యక్షుడి భద్రత కోసం ఏడాది పొడవునా సీక్రెట్‌ సర్వీస్ ఏజెన్సీ పని చేస్తుంటుంది. చీమ చిటుక్కుమన్నా దానిని పసిగట్టేంతగా నిఘా పెడుతుంది. అధ్యక్షుడు టాయ్‌లెట్‌కు వెళ్లినా ఆ పరిసరాలపై నిఘా సీక్రెట్ సర్వీస్ నిఘా ఉంటుంది. ఇక అమెరికా అధ్యక్షుడి విదేశీ పర్యటనల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మూడు నెలల ముందు నుంచే ప్లానింగ్ ఉంటుంది.

 

పర్యటన ప్రదేశానికి అధ్యక్షుడు చేరుకునే సమయానికి కొద్ది రోజుల ముందే వివిధ రకాల వస్తువులు, సామగ్రితో కూడిన ఏడు విమానాలు అక్కడికి చేరుకుంటాయి. అందులో ఓ హెలికాఫ్టర్‌, ప్రత్యేకమైన కారు ఉంటాయి. వీటిలో సమాచార వ్యవస్థ పకడ్బందీగా ఉంటుంది. ప్రెసిడెంట్ కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని లైవ్‌ రికార్డింగ్‌ చేస్తారు.

 

trump security detail కోసం చిత్ర ఫలితం

ప్రెసిడెంట్ కు అందించే ఆహారాన్ని ముందు సీక్రెట్ ఏజెంట్లు పరీక్షిస్తారు. వంటలను తయారు చేసేందుకు ప్రత్యేకంగా నియమించిన వంటవారు, సిబ్బంది విదేశీ పర్యటనలకు అధ్యక్షుడి వెంటే వస్తారు. విదేశీ పర్యటనలో అధ్యక్షుడు బస చేసే ప్రాంతాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. ఇక అధ్యక్షుడు ఉండే గదిలో కిటికీలకు బుల్లెట్‌ ప్రూఫ్‌ ప్లాస్టిక్‌ అద్దాలను బిగిస్తారు. అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రతా వలయాన్ని దాటి వెళ్లకూడదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: