ఏపీ నుంచి, మార్చి నెలలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్న నేపధ్యంలో ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్ల సందడి మొదలయ్యింది.. కాగా  ఈ నాలుగు  స్ధానాలు కూడా వైసీపీకే దక్కనున్నాయి. ఇప్పుడు సీఎం  జగన్ ఈ నాలుగు స్ధానాలకు అభ్యర్ధులను ఎంపిక  చేసే పనిలో పడ్డారు. అయితే ఈ నాలుగు స్ధానాలకు జగన్ ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై  పలు ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో ఉత్కంఠ ఏర్పడింది.

 

 

ఇదే కాకుండా  శాసనమండలిని రద్దు చేస్తూ, వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పార్టీలో ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వారు రాజ్యసభ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉండగా, ఇప్పుడే రాజ్యసభ సీట్లు వీరికే అంటూ కొన్ని పేర్లు వినబడుతున్నాయి. అయితే  గత కొంత కాలం నుండి, చాలామంది పేర్లలో ఎక్కువగా చిరంజీవి, వైఎస్ షర్మిల పేర్లు వినబడుతున్న విషయం తెలిసిందే..

 

 

అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరి పేర్లు రాజ్యసభ రేసులో లేవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. అయితే కొందరు మాత్రం.. బీద మస్తాన్ రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలలో ఒకరికి రాజ్యసభ సీటు దక్కనుందని అంటుండగా, మరో సీటు విషయంలో సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పేరు వినిపిస్తోంది.

 

 

ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎంపీ టికెట్ ను త్యాగం చేయడం వల్ల, ఇతనికి రాజ్యసభ సీటు దక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే  బీజేపీ పేరు.. నాలుగో సీటు విషయంలో తెరపైకి వస్తోంది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా….జగన్ ను రాజ్యసభ సీటు కోరినట్టు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో చిరంజీవి, వైయస్ షర్మిల పేర్లు ఎక్కడ వినపడటం లేదు.. దీంతో  వీరిద్దరికి సీయం జగన్ భారీ షాక్ ఇచ్చినట్లు తాజాగా వార్తలు బయటకు వస్తున్నాయి... 

మరింత సమాచారం తెలుసుకోండి: