క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి ప్రతి విషయంలోను జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టడమే పని పెట్టుకున్నారు చంద్రబాబునాయుడు, చినబాబు. దాని ఫలితమే చంద్రబాబు అడ్డుగోలు ఐదేళ్ళ పరిపాలనపై  ’సిట్’ విచారణ. ఇన్ సైడర్ ట్రేడింగ్ కానీండి, విశాఖపట్నంలో భూ కబ్జాలు కానీండి, పోలవరం అవినీతి...ఇలా చెప్పుకుంటు పోతే  చంద్రబాబు అవినీతి చాలానే ఉంది.

 

చంద్రబాబు పాలన గురించి  ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు, లోకేష్ అండ్ కో జగన్ ను రెచ్చగొట్టిన విషయం అందరికీ తెలిసిందే.  పదే పదే బహిరంగసభల్లోను, ట్విట్టర్ లాంటి వేదికల మీద కూడా మొత్తం టిడిపి నేతలు జగన్ పై తొడగొట్టి సవాలు చేసిన విషయం అందరూ చూసిందే.  దమ్ముంటే, ధైర్యముంటే అంటూ బాగా రెచ్చగొట్టారు. తీరా ఐదేళ్ళ పాలనపై సిట్ విచారణకు జగన్ ఆదేశించగానే ఇపుడు రివర్స్ లో మాట్లాడుతున్నారు.

 

ఐదేళ్ళ పాలన అనేకాదు మొత్తం రాజకీయ జీవితంలోనే చంద్రబాబు ఎంతటి అవినీతిపరుడో అందరికీ తెలిసిందే. అవినీతి వ్యవహారాల్లో దొరికితేనే దొంగలని దొరకని వాళ్ళంతా నీతిమంతులే అని అనుకునేందుకు లేదు. కాబట్టి చంద్రబాబు పులు కడిగిన ముత్యమని అనుకునే జనాలెవరూ ఉండరు. అలాంటిది ప్రధానంగా అమరావతి గ్రామాల్లో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ టిడిపిలోని చాలామంది ముఖ్యులు తగులుకునేటప్పటికి కక్షసాధింపు చర్యలంటు గోల మొదలుపెట్టారు.

 

ఆ తర్వాత జరిగిన ఐటి దాడులతో జగన్ కు సంబంధం లేకపోయినా టిడిపి నేతలంతా జగన్ నే టార్గెట్ చేస్తు ఎంతగోల చేసింది అందరూ చూసిందే. ఇక తాజాగా  ఇఎస్ఐ స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు పీకల్లోతు ఇరుక్కునేటప్పటికి బిసి కార్డును తెరపైకి తెచ్చి యాగీ మొదలుపెట్టారు. మొత్తం మీద పదే పదే జగన్ ను రెచ్చగొడితే ఫలితం ఇలాగే ఉంటుందని అనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: