అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబంతో కలిసి ఈరోజు మధ్యాహ్నం గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకుంటున్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తుల్లో ఒకరు. ట్రంప్ వ్యక్తిగత జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ట్రంప్ మెలానియా మధ్య 24 సంవత్సరాల తేడా ఉన్నప్పటికీ ప్రేమ చిగురించింది. 52 సంవత్సరాల వయస్సులో టెలివిజన్ పర్సనాలిటీ, బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ రెండో భార్యతో వేరుగా ఉంటున్నారు. 
 
అదే సమయంలో 1998లో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీలో ట్రంప్ మెలానియాను చూశాడు. ట్రంప్ కు మెలానియా తొలిచూపులోనే నచ్చటంతో ఆమెను పరిచయం చేసుకున్నాడు. పుట్టుకతోనే అందగత్తె అయిన మెలానియా 16వ ఏటనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ట్రంప్ మెలానియాను పరిచయం చేసుకొని ఆమె ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నారు. 
 
మెలానియాకు కూడా తొలిచూపులోనే ట్రంప్ పై ఇష్టం ఏర్పడినప్పటికీ ట్రంప్ కు నంబర్ మాత్రం ఇవ్వలేదు. ఆ తరువాత ట్రంప్, మెలానియా మధ్య ప్రేమ హోవార్డ్ స్టెర్న్ టీవీ షోలో బయటపడింది. ఇద్దరి మధ్య 24 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ వారు ఆ విషయాలని ఏం పట్టించుకోలేదు. ఇద్దరి మధ్య ప్రేమ పెరగటం, ఒకరిపై ఒకరికి చచ్చేంత ఇష్టం ఏర్పడటంతో 2005 సంవత్సరంలో మెలానియాకు ట్రంప్ తో వివాహమైంది. 
 
మెలానియాకు మొదట్లో ట్రంప్ అమ్మాయిల వ్యవహారాలు నచ్చేవి కావు. ఆ తరువాత ట్రంప్ తన పద్ధతిని మార్చుకుంటూ వచ్చాడు. ఇవాంకా ట్రంప్ మొదటి భార్య కూతురు. ప్రపంచ మీడియా దృష్టిలో ఇప్పటికీ ట్రంప్ మెలానియా నంబర్ వన్ జంటగానే కొనసాగుతున్నారు. ట్రంప్ మెలానియా ప్రేమకథ ఒక రొమాంటిక్ సినిమాను తలపిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.       
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: