అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు వస్తున్న నేపధ్యంలో ఆయన పర్యటనలోని  ప్రతి చిన్న విషయం కూడా ఎంతో ఆసక్తిగానే ఉంటుంది. అనేక విషయాల్లో అమెరికా సీక్రెట్ సర్వీసు వ్యవహారం మాత్రం భిన్నంగా ఉంటుంది. చాలామందికి దీని గురించి పెద్దగా తెలీదు. ఎందుకంటే దీనిపేరే అమెరికా సీక్రెట్ సర్వీసు కదా. కాకపోతే ఇపుడు ఇండియా టూర్ సందర్భంగా సీక్రెట్ సర్వీసుకున్న పవన్ ఎంటనే విషయంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి.

 

ఈ విభాగం మొదట 1865లో ప్రారంభమైంది. అప్పట్లో అధ్యక్షుడి రక్షణ బాధ్యత ఈ సర్వీసుకు లేదు. కాకపోతే సర్వీసు ప్రారంభమైన తర్వాత ఇద్దరు అధ్యక్షులు వరుసగా హత్యకు గురికావటంతో ప్రెసిడెంట్ రక్షణ బాధ్యత కూడా ఈ సర్వీసుకే అప్పగిస్తు చట్టంలో మార్పులు తెచ్చారు.  అప్పటి నుండి అధ్యక్షుడి బాధ్యతలూ నూరుశాతం సీక్రెట్ సర్వీసు సిబ్బందిదే.

 

సీక్రెట్ సర్వీసు భద్రత ఎలాగుంటుందంటే అధ్యక్షుడు పర్యటించే ప్రాంతాన్ని ముందుగానే సర్వీసు రక్షణ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. చుట్టూ పక్కల ప్రాంతాలతో పాటు అధ్యక్షుడిపై సడెన్ గా దాడి జరిగితే తప్పించుకునేందుకు ఉన్న అవకాశాలను కూడా ముందుగానే ఓపెన్ చేసి పెట్టుకుంటుంది. తప్పించుకునే అవకాశం లేకపోతే అసలు పర్యటనకే నో చెప్పే అధికారం సర్వీసుకుంటుంది. ఒకసారి సర్వీసు నో చెప్పిందంటే అధ్యక్షుడు దాన్ని మార్చలేరు. అమెరికా సీక్రెట్ సర్వీస్ అంటే అంత పవర్ ఫుల్.

 

అధ్యక్షుడి పర్యటనకు ముందే సర్వీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ముందే ఇండియా వచ్చేశారు. ఇక్కడి నేషనల్ సెక్యురిటి గార్డ్స్ (ఎన్ఎస్జి) ఉన్నతాధికారులతో భద్రతా వ్యవహారాలను  సమన్వయం చేసుకుంది. తమ అధ్యక్షుడు పాల్గొనే ప్రాంతాలతో పాటు విశ్రాంతి తీసుకునే హోటల్ ప్రాంతాన్ని కూడా సీక్రెట్ సర్వీసు అధికారులు ముందుగానే తమ ఆధీనంలోకి తీసేసుకుంటారు. ప్రస్తుతం ట్రంప్ విశ్రాంతి తీసుకుంటున్న హోటల్లోకి ఇతరులు ఎవరినీ అనుమతించరు.

 

అధ్యక్షుడు ప్రయాణించే బీస్ట్ కారు, పైన కాపలాగ వచ్చే హెలికాప్టర్లు, విమానాశ్రయంలో రెడీగా ఉండే ఎయిర్ ఫోర్స్ 1 విమానం తదితరాలన్నీ సీక్రెట్ సర్వీసు ఆధీనంలోనే ఉంటాయి. ఈ సర్వీసులో మొత్తం 7 వేలమంది అధికారులుంటారు. ప్రస్తుతం 4 వేలమంది సీక్రెట్ సర్వీసు అధికారులు ట్రంప్ తో పాటు పర్యటిస్తున్నారంటేనే  భద్రత ఏ స్ధాయిలో ఉందో ఎవరికి వారే ఊహించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: