అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన నిమిత్తం ఇండియాకు వస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి ట్రంప్ భారత్ పర్యటనకు వస్తూ ఉండటంతో ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది. గత పది సంవత్సరాల్లో భారత్ అమెరికా మధ్య సంబంధాలు కూడా బలపడ్డాయి. ట్రంప్ పర్యటన వలన ఇరు దేశాల మధ్య భద్రత విషయంలో పరస్పర సహకారంపై అవగాహనకు రానున్నారని ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ భారతదేశ పర్యటన గురించి ఆసక్తి నెలకొంది. భారత్ - అమెరికాలు ప్రధానంగా స్వేచ్ఛా వాణిజ్యం, ఉగ్రవాద నిరోధం, హిందూ మహా సముద్ర ప్రాంతంలో శాంతి మరియు శ్రేయస్సు లక్ష్యాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రేపు మోదీ, ట్రంప్ ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారం, ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. 
 
అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో భద్రత, శాంతిస్థాపనకు భారత్ పూర్తిగా సహకరిస్తోందని భావిస్తోంది. భారత్ ఆఫ్ఘన్ శాంతి ప్రక్రియలో పాక్ ను పక్కనబెట్టి సరిహద్దు తీవ్రవాదాన్ని నిరోధించాలని భావిస్తోంది. మోదీ, ట్రంప్ ప్రాంతీయ సమైక్యత దెబ్బతినకుండా పారదర్శకత, భారత సార్వబౌమాధికారంలాంటి అంశాలను గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. పాక్ ఆఫ్ఘన్, అమెరికా మధ్య కుదిరే చారిత్రాత్మక శాంతి ప్రక్రియ తమ సమక్షంలో కుదురుతుందని భావిస్తుండగా పాక్ ను ఇందులో భాగస్వామ్యం కాకుండా చేసి పాక్ కు షాక్ ఇవ్వాలని భారత్ భావిస్తోంది.

 

మోదీ, ట్రంప్ ఉగ్రవాదాన్ని నిరోధించటం కొరకు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. 2015 సంవత్సరంలో ఒబామా - మోదీ మధ్య జరిగిన భేటీలో ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేయాలని మోదీ, ఒబామా నిర్ణయం తీసుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన మోదీ - ట్రంప్ భేటీలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: