ప్రస్తుతం దేశం మొత్తం చూపు అమెరికా అధ్యక్షుడు ప్రపంచదేశాలకు పెద్దన్నగా లాంటి డోనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటన పై ఉన్న విషయం తెలిసిందే. మొదటిసారి డోనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇక మరో గంటలో డోనాల్డ్ ట్రంప్ కుటుంబంతో గుజరాత్లోని అహ్మదాబాద్లో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ పర్యటించిన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇక డోనాల్డ్ ట్రంప్ కు ఘన స్వాగతం పలికేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  పర్యటన కోసం ఏకంగా కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా అహ్మదాబాద్ కు చేరుకోనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... నమస్తే ట్రంప్  కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

 

 

అంతేకాకుండా ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో కూడా డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ట్రంప్  పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది  కేంద్ర ప్రభుత్వం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా... అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రంప్  పర్యటనలో భాగంగా సబర్మతి ఆశ్రమాన్ని కూడా సందర్శించనున్నట్లు  తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సబర్మతి ఆశ్రమం వద్ద కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు. పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొతేరా  స్టేడియం వరకు మొత్తం 16 చోట్ల తాగునీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి తాగునీటి సరఫరా కేంద్రం వద్ద ముగ్గురు సిబ్బందిని ఉంచారు.

 

 

 

 నమస్తే ట్రంప్  కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తాగునీటిని సరఫరా కేంద్రాలు  చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటిసారి భారత్లో పర్యటిస్తుండటంతో... ట్రంప్  పర్యటనలో ట్రంప్ నీ  ఆకర్షించి ఎన్నో పెట్టుబడులను ఇండియాలోకి రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ట్రంపు పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఖర్చు కూడా ఎన్నో విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదట ఇండియాలో కాలు పెట్టిన ట్రంప్ కి దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: