ఏం బ్రతుకులో ఏమో భయ్యా. ముందు ముందు ప్రపంచంలో మనుషులతో కాపురాలు చేయడం కంటే రోగాలతోనే సంసారాలు చేసేలా ఉన్నారు.. ఎవరిని ముద్దు పెట్టుకుంటే ఏ రోగం వస్తుందో అనే భయం. ఏ స్నేహితున్ని కలుసుకోవాలన్న, వాడి వల్ల ఏదైన వైరస్ అంటుతుందో అనే టెన్షన్.. ఇలా రోజు చచ్చి బ్రతుక్తున్నామని విదేశీయులు వాపోతున్నారట.

 

 

ఎందుకంటే విదేశాల్లో శృంగారానికి ప్రాధ్యాన్యత ఎక్కువ ఇక పెదాలు పెదాలు చప్పరించడం మామూలే.. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే.. కరోనా పుణ్యమా అని సంసారాలు కూడా సరిగా చేయలేక పోతున్నారని బాధపడుతున్నారు.. ఎంత సన్నిహితులు అయినా ఒకరిని ఒకరు ఎదురు పడినప్పుడు ఖచ్చితంగా టెన్షన్ పడుతున్నారు అనటం లో ఆశ్చర్యమే లేదు. ఇక సామూహిక కార్యక్రమాలు అయితే వీలైనంత వరకూ తప్పించుకుంటున్నారట.. కానీ కొన్ని సార్లు తప్పదు కదా అలాంటి ఒక సిట్యుయేషన్ ఎదురవగా ఫిలిప్పిన్ ప్రజలు తెలివిగా ఆలోచించి ఆనందించారు..

 

 

ఇకపోతే ఫిలిప్పిన్ లోని బాకొలాడ్‌లో, స్థానిక సిటీహాల్‌లో సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో మొత్తం 220 జంటలు ఒక్కటయ్యాయి. పెండ్లి కొడుకులు పెండ్లి కూతుళ్లు పెళ్లి బట్టలతో ఈ సామూహిక వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. కాగా, వాలైంటైన్స్ డే తర్వాత సామూహిక వివాహాలు చేసుకోవడం మనీలాలో ఓ సంప్రదాయంగా వస్తోంది. 2013లో అత్యధికంగా 2,013 జంటలకు వివాహాలు జరిగి వార్తల్లో నిలచింది. అయితే ఈసారి మాత్రం వధూవరులు మాస్కులు ధరించడం, వాటితోనే ముద్దాడటం సంచలనంగా మారింది.

 

 

ఇలా ఎందుకంటే కోవిడ్‌ వైరస్‌ అన్ని దేశాలకు పాకుతుండటంతో ఈ సామూహిక వివాహ మహోత్సవ నిర్వాహకులు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. అంతే కాకుండా అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనను నిర్వాహకులు కచ్చితంగా అమలు చేయడంతో, పెండ్లి పీటలెక్కిన జంటలు మాస్కులతోనే ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, ఆఖరికి ముద్దులు కూడా మాస్కులు ధరించే పెట్టుకోవాల్సి వచ్చింది.

 

 

మాస్కులతో ముద్దులు పెట్టుకోవడం ఇబ్బందిగానే ఉన్నా.. కోవిడ్‌ భయంతో తప్పదు కదా అని కొత్త జంటలు సరిపెట్టుకున్నారు. వధూవరులు సర్జికల్ మాస్కులు ధరించి ముద్దులు పెట్టుకోవడం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది సరే గాని ఇలా మాస్కులు ధరించిన కొత్తజంటలు ఎంతకాలం సంసారం చేస్తారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.. ఓ ముద్దుముచ్చట తీర్చుకోలేని సమయంలో ఈ పెళ్లి అవసరమా అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: