డోనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా భారతదేశంలో పర్యటించ నుండటంతో  డోనాల్డ్ ట్రంప్ పర్యటన ఎంతో ఆసక్తిని సంతరించుకున్న విషయం తెలిసిందే. ఇండియాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు డోనాల్డ్ ట్రంప్. 24వ తేదీ లో ఇండియా కు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 24 వ తేదీతో పాటు 25 వ తేదీలలో కూడా ఇండియాలో పర్యటించనున్నారు. ముందుగా అహ్మదాబాద్లోని విమానాశ్రయంలో అడుగుపెట్టనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్  ఆ తర్వాత మొతేరా  స్టేడియంలో ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్  అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే డోనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో అమెరికా సీక్రెట్ ఏజెన్సీ తో పాటు భద్రతా బలగాలు కూడా అహ్మదాబాద్ నగరంలో భారీగా మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 

 


 ఇక ట్రంప్  పర్యటన కోసం మోడీ ప్రభుత్వం ఏకంగా వంద కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ట్రంప్  పర్యటన నేపథ్యంలో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ అయిపోయిన వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా డోనాల్డ్ ట్రంప్ పర్యటనపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే మొన్నటికి మొన్న... డోనాల్డ్ ట్రంప్ కు పర్యటన నేపథ్యంలో... కోటిమంది రావాలంటే... సల్మాన్ ఖాన్,  షారుక్ ఖాన్,  రజినీకాంత్ అమీర్ ఖాన్,  దీపికా పదుకొనే,  లతోపాటు సన్నీలియోన్ కూడా రావాలి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు రాంగోపాల్ వర్మ. 

 


 ట్రంపు ఇండియాకి ఆహ్వానించడానికి మనం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాను. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని అమెరికాకు స్వాగతించడానికి అమెరికన్లు వేల రూపాయలు ఖర్చు చేసారా  అది అమెరికా భారత్ కాదు అంటూ వ్యంగ్యంగా అన్నాడు రాంగోపాల్ వర్మ. ట్రంప్  ఇండియా కి రావడానికి ఒక కారణం తను ఇండియా వస్తున్నాడు అంటే ఎంతమంది అతనిని చూడటానికి వస్తారు అని ఆసక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ట్రంపు చనిపోయే వరకు దీనిని గొప్పగా చెప్పుకోవచ్చు. తన కోసం పది మిలియన్ల మంది రావచ్చు కానీ  ట్రంప్  మాత్రం 15 మిలియన్ల జనాలు వచ్చారు అని అబద్ధం చెబుతాడు అంటూ మరో ట్వీట్ పెట్టాడు రాంగోపాల్ వర్మ. ఇలా వరుస పోస్టులతో ట్రంప్  పర్యటన పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు  రాంగోపాల్ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: