బయట పరిస్థితులు బాగాలేవని అమ్మ కడుపులోనే అభిమన్యుడిలాగా తెలుసుకున్నాదేమో బహుశా. తనని బలవంతగా ఈ కలియుగంలోకి తీసుకువచ్చారని తన ఉగ్రరూపాన్ని చూపింది ఈ పాపా. పాపాల చేసే మనుషుల మధ్య తనను ఎందుకు తీసుకువచ్చారంటూ డాక్టర్ పై కొరకొర కోపంగా చూస్తూ ఉండిపోయింది.

 

పిల్లలు పుట్టగానే ఏడ్వడం మంచిదంటారు. శిశువు ఊపిరితీత్తులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకొనేందుకు పిల్లలను ఏడిపించడం సర్వ సాధారణం. అయితే, బ్రెజిల్‌ లోని

రియోడీ జెనీరో నగరంలో పుట్టిన ఓ నవజాత శిశువు పుట్టిన వెంటనే ఏడవకుండా.. డాక్టర్ వైపు కోపంగా చూడటం ఆశ్చర్యపరిచింది.

 

ఫిబ్రవరి 13న వైద్యులు సిజేరియన్ ద్వారా ఆడ బిడ్డను బయటకు తీశారు. బొడ్డు తాడు కత్తిరించక ముందే ఆ బిడ్డ ఏడుస్తాడో లేదోనని పరీక్షించారు. చిత్రంగా ఆ బిడ్డ ఏడ్వడానికి బదులు డాక్టర్ల వైపు కోపంగా చూసింది. ‘‘నాకు ఇంకా కడుపులోనే ఉండాలని ఉంది. అప్పుడే బయటకు ఎందుకు తీశారు’’ అన్నట్లుగా వారిపై ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ముఖం పెట్టింది. అతడు ఎంతకీ ఏడవక పోయేసరికి డాక్టర్లు ఆ బిడ్డ బొడ్డు తాడును కత్తిరించారు. అంతే.. ఆ బాధకు ఆ శిశువు గట్టిగా ఏడ్చింది. దీంతో వైద్యులు కూడా ఆ బిడ్డ ఆరోగ్యంగానే ఉందని ఊపిరి పీల్చుకున్నారు.

 

ప్రసవానికి ముందే బిడ్డకు ఆమె తల్లిదండ్రులు ఇసాబెలా పెరీరా డి జీసస్ అని పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన ఆనంద క్షణాలను చిత్రాల్లో బంధించేందుకు ఇసాబెలా తల్లి డయాన్ డి జీసస్ బార్బోసా స్థానిక ఫొటోగ్రాఫర్ రోడ్రిగో కున్స్‌ట్మాన్‌ను ఏర్పాటు చేసుకుంది. అందుకే, మనం ఈ అరుదైన చిత్రాలను చూసే అవకాశం కలిగింది. అయితే, ఈ ఫొటోలపై నెటిజనులు జోకులు పేలుస్తున్నారు. ఈ ఫొటోలతో మీమ్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. మరి, ఈ బిడ్డ ఎక్స్‌ప్రెషన్‌ కు మీరు ఏమనుకుంటున్నారు?

మరింత సమాచారం తెలుసుకోండి: