ఈ మద్య కొంత మంది క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వారు ప్రాణాలు కోల్పోవడమే కాదు.. ఎదుంటి వారి ప్రాణాలు హరిస్తున్నారు.  దాంతో ఇరు కుటుంబాల్లో విషాదాలు చోటు  చేసుకుంటున్నాయి.  ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రేమోన్మాధులు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.  అమ్మాయిని ప్రేమించడం.. తాను కాదంటే వేధించడం.. చివరికి ఆమెను లేదంటే కుటుంబ సభ్యులను ప్రాణాలు తీయడానికి కూడా వేనుకాడని పరిస్థితి నెలకొంటుంది.  ఆ మద్య తన ప్రేమను కాదని వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని కుటుంబ సభ్యులను చంపేందుకు ప్రేమికుడు ఇల్లు కాలబెట్టిన విషయం గుర్తుంది కదా.. ఇక తన ప్రేమను కాదంటుందని..  ప్రేమించిన అమ్మాయి తల్లిపై కాల్పులకు తెగబడ్డాడు. అలాగని అతడు సైకో కాదు. బాధ్యాతాయుతమైన వృత్తిలో ఉన్న ఆర్మీ జవాను. చివరికి తన ప్రాణాలు తానే తీసుకోని బ్రతుకును అర్థాంతరంగా ముగించాడు. నడింపల్లిలో నివశించే రమాదేవి కూతుర్ని ఆర్మీ జవాన్ బాలాజీ గత కొద్దికాలంగా ప్రేమిస్తున్నాడు. 

 

కానీ ఆ యువతి అతన్ని ప్రేమించడం లేదు.  ఇంట్లో వాళ్లకు బాలాజీ వేధింపుల గురించి తెలియజేసింది. దీంతో యువతి తల్లి రమాదేవి అతడికి వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి తన కూతురు ఊసు ఎత్తొద్దని గట్టిగానే చెప్పింది. దాంతో అతను ఆ యువతిపైనే కాదు ఆమె తల్లిపై కూడా పగ పెంచుకున్నాడు. ప్రేమ పెళ్లికి ఒప్పుకోని రమాదేవి బాలాజీపై కేసు పెట్టింది. దీంతో ఉద్యోగం కోల్పోయిన బాలాజీ కక్ష పెంచుకున్నాడు. శనివారం పొద్దున ఆమె ఇంటికి వెళ్లి నాటు తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. బుల్లెట్ చెవిని చీల్చుకుంటూ వెళ్లడంతో రమాదేవి ప్రాణాలతో బయటపడింది.

 

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  ఇక అక్కడ నుంచి పారిపోయాడు బాలాజీ.  అయితే అందరూ షాక్ కి  గురయ్యేలా..  రైలు కింద పడి బాలాజీ సూసైడ్ చేసుకున్నాడు. తన కొడుకుది సూసైడ్ కాదని, యవతి తల్లి రమాదేవి, బంధువులే హత్య చేయించి ఉంటారని బాలాజీ తండ్రి ఆరోపించారు. గతంలో కేసులు పెట్టి తమ కుటుంబాన్ని వేధించారని అన్నారు. ప్రేమించిన అమ్మాయి దక్కుంటా ఇలా ప్రాణాలు తీసి... ప్రాణాలు తీసుకునే స్థాయికి యువత చేరుకోవడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: