గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందరినీ టెన్షన్లోకి నెట్టేశారు. ఉదయం సుమారు 11.35 నిముషాలకు అహ్మదాబాద్ విమానాశ్రయంలోకి ట్రంప్ ప్రయాణం చేసిన ఎయిర్ ఫోర్స్ 1 విమానం చేరుకుంది.  విమానం ల్యాండ్ అయిన 10 నిముషాలకు  ట్రంప్ కూతురు ఇవాంక విమానంలో నుండి దిగి బయటకు వచ్చారు.

 

ఆ తర్వాత ఇంకెవరూ దిగలేదు. ఒకవైపు నరేంద్రమోడి వచ్చి విమానాశ్రయం రన్ వే దగ్గరే వెయిట్ చేస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి రూపానీ లాంటి ముఖ్యమైన వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. కానీ ట్రంప్ ఎంతకీ దిగలేదు. మొత్తానికి దాదాపు పావుగంట అంటే 15 నిముషాల పాటు ట్రంప్ ఎందుకు విమానంలో నుండి దిగలేదో ఎవరికీ అర్ధం కాలేదు. అమెరికా సీక్రెట్ సర్వీసు ఉన్నతాధికారులతో పాటు నేషనల్ సెక్యురిటీ గార్డు ఉన్నతాధికారులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 

మొత్తానికి అంటే 11.55 గంటలకు ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి విమానం ముఖ ద్వారం దగ్గరకు చేరుకున్నారు. అదే సమయానికి మోడి కూడా విమానం మెట్ల దగ్గరకు వచ్చారు. తర్వాత ట్రంప్ దంపతులు అందరికీ అభివాదం చేస్తు మెల్లిగా విమానం మెట్లు దిగి మోడి దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే ట్రంప్ దంపతులు ప్రయాణం చేయాల్సిన బీస్ట్ వాహనం కూడా రెడీగా వెయిట్ చేస్తోంది.

 

మొత్తానికి రన్ వే మీదకు చేరుకున్న ట్రంప్ దంపతులకు మోడి స్వాగతం పలికారు. తర్వాత గుజరాత్ సిఎం తదితర ముఖ్యులను ట్రంప్ కు పరిచయం చేశారు. అక్కడి నుండి అందరూ కలిసి మోతేరా స్టేడియంకు బయలుదేరారు. అయితే పావుగంట పాటు ట్రంప్ దంపతులు విమానంలో నుండి దిగకుండా ఏమి చేశారు ? అన్నదే అందరినీ టెన్షన్ పెట్టేసింది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి ? ట్రంప్ దంపతులు మాత్రమే సమాధానం చెప్పగలరు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: