భారత్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన ఎంతో ఆసక్తిని సంతరించుకుంది. మొదటిసారి అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలకు పెద్దన్న లాంటి డోనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తుండటంతో  ఈ ఆసక్తి మరింతగా పెరిగిపోయింది. అయితే 24 25 తేదీల్లో డోనాల్డ్ ట్రంప్  భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇక డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత్లో అడుగు పెట్టారు. ఇక డోనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా వందల కోట్లు ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే. ఇక డోనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో అడుగడుగునా భారీ మొత్తంలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ అక్కడి నుంచి 23 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి మొతేరా స్టేడియానికి చేరుకోనున్నారు. 

 

 

 అయితే డోనాల్డ్ ట్రంప్ కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని  ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రకాల డిష్ లను కూడా ట్రంప్  కోసం ఏర్పాటు చేస్తారు ప్రధాని మోదీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మాంసం అంటే చాలా ఇష్టం... అలాగే మెక్ డొనాల్స్ ఉత్పత్తులు వంటివి కూడా ట్రంప్ ఇష్టపడతారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ ట్రంప్ కోసం  వెజిటేరియన్ ఆహారాన్ని ఇవ్వబోతోన్నారు.  ఫార్చ్యూన్ లాండ్మార్క్ హోటల్ ప్రముఖ సురేష్ కన్నా.. ఈ ఆహారాన్ని తయారు చేస్తున్నారు. ముఖ్యంగా గుజరాతి ఆహార పదార్థాలన్నింటిని అహ్మదాబాద్లో ప్రేమ్ పర్యటనలో పెట్టనున్నారు.

 

 

 ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత ట్రంపు ముందుగా వెళ్ళేది సబర్మతీ ఆశ్రమానికి... ఇక అక్కడ హై టీ తో పాటూ  చిన్నపాటి అల్పాహారం కూడా ఇవ్వబోతున్నారు.హై టీ తో పాటు రుచికరమైన ఫార్చ్యూన్ కుకీస్ గుజరాత్ లో ఫేమస్ అయిన నైలాన్ కమాన్ డోక్లాలను  కూడా డోనాల్డ్ ట్రంప్ కు ఆశ్రమంలో ఇవ్వనున్నారు. వీటితో పాటు అల్లం మసాలా టీ  కూడా కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు ఆయన తెలిపారు. అల్లం మసాలా టీ  అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి చాలా ఇష్టమట. అయితే డోనాల్డ్ ట్రంప్ ఆహారాల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇదివరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అతిథులు వచ్చినప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకునే వారు ప్రధాని మోదీ. అయితే పదిహేనేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ నమ్మదగిన చెఫ్  ఎవరు అంటే సురేష్ కన్నా అని చెప్పవచ్చు. అందువల్ల ఈసారి కూడా సురేష్ కన్నా కే మోదీ అవకాశం ఇచ్చారు. ఇక సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం వారంతా కలిసి మేతేరా  క్రికెట్ స్టేడియంలో జరిగే నమోదు కార్యక్రమానికి వెళ్లి పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: