అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త్‌లోకి దిగిపోయారు. అమెరికా నుంచి యూర‌ప్‌లోని జ‌ర్మ‌నీ మీదుగా అహ్మ‌దాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వాస్త‌వంగా షెడ్యూల్ ప్ర‌కారం 11.40 గంట‌లకు ట్రంప్ దంప‌తులు ఇండియాకు రావాల్సి ఉంది. అయితే 10 నిమిషాలు ఆల‌స్యంగా 11.50 గంట‌ల‌కు ట్రంప్ దంప‌తులు అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ట్రంప్ దంప‌తులు విమానం దిగిన వెంట‌నే మోడీ ముందుగా ట్రంప్‌ను ఆలిగ‌నం చేసుకుని క‌ర‌చాల‌నం చేస్తూ స్వాగ‌తం ప‌లికారు.

 

ఇక మెల‌నియాతో క‌ర‌చాల‌నం చేస్తూ స్వాగ‌తం ప‌లికారు. ఇక అక్క‌డ నుంచి ట్రంప్ దంప‌తులు మొతేరా స్టేడియానికి చేరుకోనున్నారు. మొత్తం 22 కిలోమీట‌ర్ల పాటు ఈ ర్యాలీ సాగ‌నుంది. ల‌క్ష‌లాది మంది ఇప్ప‌టికే రోడ్ల‌కు ఇరువైపులా చేరుకుని ట్రంప్‌కు స్వాగ‌తం ప‌లికేందుకు రెడీగా ఉండ‌నున్నారు. అయితే ట్రంప్‌తో విమానం దిగిన ఆయ‌న భార్య‌, అమెరికా తొలి మ‌హిళ మెల‌నియా ముద్దులు కాస్త చ‌మ‌త్కారంగా ఉన్నాయి.

 

భార‌త్లోని అమెరికా రాయ‌భారుల‌తో పాటు త‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చిన అధికారుల‌ను ఆలిగనం చేసుకున్న మెల‌నియా మ‌న‌కు తెలిసిన‌ట్టుగా బుగ్గ‌ల‌పైనో లేదా నుదిటిపైనో కాకుండా... ఆమె ఆలింగ‌నం చేసుకుంటూ త‌ల ప‌క్క‌న గాల్లో ముద్దులు పెట్ట‌డం విశేషం. ఇవి భ‌లే చ‌మ‌త్కారంగా ఉన్నాయనిపించింది. ఇక ఎయిర్‌పోర్టు నుంచి ట్రంప్ దంప‌తులు నేరుగా సబర్మతి ఆశ్రమానికి ట్రంప్ దంపతులు వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి ట్రంప్ హాజరుకానున్నారు.

 

ఇక ప్ర‌పంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా రికార్డుల‌కు ఎక్క‌నున్న అహ్మ‌దాబాద్‌లోని మొతేరా స్టేడియంను ట్రంప్ ప్రారంభిస్తారు. అక్క‌డ నుంచి ఆయ‌న న‌మ‌స్తే ట్రంప్ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఇక ఇప్ప‌టికే మోతేరా స్టేడియం ఏకంగా ల‌క్ష‌కు పైగా జ‌నాలతో కిక్కిరిసి పోయింది. అక్క‌డ ఉద‌యం నుంచి అనేక సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇక్క‌డ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ట్రంప్ ఢిల్లీలో మౌర్య హోట‌ల్లో బ‌స చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: