అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా కొద్ది క్షణాల క్రితమే భారత్ లో అడుగు  పెట్టారు. భారత్ లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ట్రంప్ వస్తున్నారు. ఈ సందర్భంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు భారత్ లో అనేక ప్రాంతాలను, అనేక మంది ప్రముఖ వ్యక్తులను కలవబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఏ విధమైన లోటు పాట్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలను భారత ప్రభుత్వం తీసుకుంది. అయితే ఈ రెండు రోజుల్లో ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేయబోయే విందు పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ట్రంప్ కి బీఫ్ అంటే చాలా ఇష్టం. బీఫ్ లేకుండా ఆయన భోజనం చేయరు. 


ఆయన ఎప్పుడు.. ఎక్కడికి.. ఏ దేశంలో పర్యటించినా ఆయన ఫుడ్ మెనులో ఖచ్చితంగా బీఫ్ ఉంటుంది. కానీ ఇప్పుడు భారత్ పర్యటనలో ఆయనకు బీఫ్ వడ్డిస్తారా లేదా అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఎందుకంటే బిజెపి ప్రభుత్వం బీఫ్ కు వ్యతిరేకం. ఇండియాలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బీఫ్ ఆయనకు వడ్డించడం చాలా కష్టమైన పనే. ఎందుకంటే ట్రంపు పర్యటిస్తున్న ఆగ్రా, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంతే కాకుండా ఆ ప్రాంతాల్లో ఆవులను పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేయబోయే విందు ఏంటి అనేది చర్చగా మారింది.


అదీ కాకుండా ప్రధాని మోదీ శాఖాహారం మాత్రమే తింటారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ కి శాకాహారాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంపు కు ఇష్టమైన బీఫ్ వడ్డిద్ధామానుకున్నా ఆయన పర్యటన ముగిసిన తరువాత బీజేపీ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది. బీఫ్ ను నిషేధించేలా  బిజెపి కఠిన చట్టాలు తీసుకు వస్తున్న తరుణంలో ఇప్పుడు స్వయంగా ప్రధాని మోదీ బీఫ్ ఏవిధంగా వడ్డించే ఏర్పాటు చేశారని ఆయన పై విమర్శలు వస్తాయి. అందుకే ట్రంప్ ఫుడ్ మెనూలో అది లేకుండా శాఖాహారాని కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లు గా సమాచారం. 


ట్రంపు పూర్తిగా గుజరాతి ఆహార పదార్థాలను వడ్డించే విధంగా మోదీ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అహ్మదాబాద్ పర్యటనలో ఆయనకు ఫార్చ్యూన్ ల్యాండ్ మార్క్ హోటల్లో ప్రముఖ చెస్ సురేష్ కన్నా ఆధ్వర్యంలో గుజరాతీ శాఖహార పదార్థాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో ఫేమస్ అయిన నైలాన్ ఖమాన్ దోఖ్లాను ఇస్తున్నారు. అలాగే బ్రకోలీ, మొక్కజొన్న పొత్తుల సమోసా, సిన్నమోన్ యాపిల్ పై (దాల్చినచెక్క యాపిల్ పై - పిజ్జా లాంటిది), కాజీ లర్కీ వంటివి అల్పాహారంగా ఇస్తున్నారు. వీటితోపాటూ... అల్లం, మసాలా చాయ్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: