అమెరికా అధ్యక్షుడు.. ప్రపంచ దేశాల పెదన్న అయిన  డోనాల్డ్ ట్రంప్ నేడు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో దేశం చూపు మొత్త ఈ ప్రర్యటన  వైపే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు అమెరికా పర్యటనకు వెళ్లారు కానీ... ట్రంప్  మాత్రం ఇప్పటి వరకూ భారత పర్యటనకు రాలేదు. ఈ నేపథ్యంలోనే మొదటిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన చేస్తుండడంతో... అమెరికా చూపు మొత్తం ట్రంపు పర్యటన పైనే ఉంది. అయితే గుజరాత్లోని అహ్మదాబాద్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ భారత్ లో అడుగు పెట్టాడు. అహ్మదాబాద్లోని విమానాశ్రయంలో దిగిన ట్రంపు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. 

 

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది సాంప్రదాయం నృత్యాలతో  ఘన స్వాగతం పలికారు. అయితే ట్రంపు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతోపాటు గుజరాత్ ప్రభుత్వం కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. భారత పర్యటనలో ట్రంప్ నీ  ఆకర్షించే వివిధ ప్రయోజనాలను చేకూర్చేకునేలా  మోదీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. భరత ఖ్యాతిని  అమెరికా అధ్యక్షుడికి తెలియపరిచేలా  ప్రధాని మోడీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక భద్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని భారత ప్రధాని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే మూడు గంటల పర్యటనకు కాదు ఏకంగా వంద కోట్లు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం.

 

 ఈ లెక్కన చూసుకుంటే ట్రంప్  పర్యటనలో నిమిషానికి  55 లక్షలు ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అన్నమాట . అంటే గుజరాత్ రాష్ట్ర బడ్జెట్లో ఈ మొత్తం 1.5%. ట్రంప్  పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకునేందుకు ఖర్చు విషయంలో అస్సలు వెనకాడడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలోనే ట్రంపు పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్ నగరం మొత్తం ఎంతో సుందరంగా ముస్తాబైంది. రోడ్లు తల తల మెరిసిపోతున్నాయి గోడలకు పెయింటింగ్ తో ట్రంప్  వెళ్లే మార్గంలో అద్దముల తయారైంది అనడంలో అతిశయోక్తి లేదు. ట్రంపు పర్యటన నేపథ్యంలో కేవలం రోడ్లను మరమ్మతు చేసేందుకు 60 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: