రాష్ట్రంలో తన ప్రత్యర్ధులెవరో జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశాడు.  ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ తనకు ప్రత్యర్ధి కానే కాదన్నారు. చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడిన ఈ రెండు ఉన్మాద మీడయా సంస్ధలే తనకు ప్రధాన ప్రత్యర్ధిగా జగన్ చెప్పటం సంచలనంగా మారింది. తన పోరాటమంతా ఆ రెండు మీడియాల్లో వస్తున్న తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలపైనే అంటూ వ్యాఖ్యనించారు.

 

తాను ఏ తప్పు చేయకపోయినా చేసేసినట్లు ఉన్మాద మీడియా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని పరిశ్రమలను రానీయకుండా, ఉన్నవి కూడా వెళ్ళిపోయేట్లు చంద్రబాబు అండ్ కో ఓ పద్దతి ప్రకారం తనపై బురద చల్లుతున్నారని జగన్ మండిపడ్డారు. తన ప్రభుత్వంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని దేశానికి చాటి చెప్పటమే రాక్షస, ఉన్మాద మీడియా ప్రధాన ఉద్దేశ్యమని బయటపెట్టారు.

 

వాళ్ళంతా కలిసి రాష్ట్రంలోకి పరిశ్రమలను రానీయకుండా అడ్డుకుంటున్నారంటూ జగన్ ఆరోపించటం కలకలం రేపుతోంది. జగన్ చెప్పాడని కాదుకానీ వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఓ వ్యూహం ప్రకారం తప్పుడు వార్తలను ప్రచారంలోకి తెస్తున్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు. తమ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించటమే చంద్రబాబు, ఉన్మాద మీడియా పనిగా పెట్టుకున్నట్లు చెప్పారు.

 

స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టి విద్యార్ధులందరికీ మంచి భవిష్యత్తును ఇవ్వాలని తమ ప్రభుత్వం అనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చాయో అందరూ చూసిందేనన్నారు.  సరే తర్వాత వైఎస్సార్ విద్యా దీవన పథకాన్ని ప్రారంభించటంలో ముఖ్య ఉద్దేశ్యాలేమిటి ? ఎంత మందికి ఉపయోగపడుతుందనే అంశాలను క్లుప్లంగా వివరించారు.

 

ఆ తర్వాత తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, వాటి ముఖ్య ఉద్దేశ్యాలను కూడా వివరించారు. అమ్మఒడి, ఆరోగ్య శ్రీ, వైఎస్సార్ కంటి వెలుగు లాంటి పథకాలు జనాలకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో వివరించారు. మొత్తం మీద  తన ప్రత్యర్ధి చంద్రబాబు కాదని ఆయనకు మద్దతుగా నిలుస్తున్న మీడియా అన్న విషయాన్ని జగన్ ఇక్కడ స్పష్టంగా చెప్పేశారు.  క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది కూడా ఇదే. టిడిపిని బతికించుకోవాల్సిన అవసరం చంద్రబాబుకన్నా చంద్రబాబును మోస్తున్న రెండు మీడియా సంస్ధలకే చాలా ఉంది. అందుకనే టిడిపికన్నా జగన్ అవే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: