ఈరోజు మధ్యాహ్నం 11.40 గంటలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లో అడుగుపెట్టారు. డొనాల్డ్ ట్రంప్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. ట్రంప్ కోసం రేపు రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేకంగా విందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విందులో పాల్గొనటానికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు అందాయి. ఆహ్వానం అందిన ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు. 
 
రేపు జరగబోయే విందులో కేసీఆర్ పాల్గొననున్నారు. కేసీఆర్ ట్రంప్ కోసం కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ ను సిద్ధం చేయించారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత తెలిసే విధంగా బహుమతులను సిద్ధం చేయించారని సమాచారం. పోచంపల్లి శాలువాను, ఫిలిగ్రి చార్మినార్ ప్రతిమతో కూడిన జ్ఞాపికను కేసీఆర్ ట్రంప్ కు అందజేయనున్నాడని తెలుస్తోంది. ట్రంప్ భార్య మెలానియా, కూతురు ఇవాంకా కోసం కూడా కేసీఆర్ ప్రత్యేక బహుమతులు సిద్ధం చేయించారు. 
 
గద్వాల పట్టు, పోచంపల్లి చీరలను కేసీఆర్ ఇవాంకా, మెలానియాలకు బహుకరించనున్నారని సమాచారం. రేపు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి విందులో పాల్గొననున్నారు. రేపంతా ఢిల్లీలోనే ఉండి బుధవారం రోజున కేసీఆర్ హైదరాబాద్ కు రానున్నారు. బహుమతులతో పాటు కేసీఆర్ కొన్ని వంటకాలను కూడా సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని తెలంగాణ వంటకాలతో పాటు నాటుకోడి పులుసును కేసీఆర్ సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు ట్రంప్ 12.30 గంటలకు మొతెరా స్టేడియానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్రంప్ కు పరిచయం చేశారు. ఆ తరువాత ప్రముఖులతో కలిసి ఫోటో దిగారు. మొతెరా స్టేడియంలో ట్రంప్ కోసం లక్షల సంఖ్యలో జనాలు హాజరయ్యారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ట్రంప్ తో కీలక ఒప్పందాలు చేసుకోనున్నారని తెలుస్తోంది. దాదాపు 9 ఒప్పందాలను చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: