అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అహ్మ‌దాబాద్‌లోని మొతేరా స్టేడియంలో అద్భుత‌మైన స్వాగ‌తం ల‌భించింది. ముందుగా భార‌త్ మాతాకు జై అంటూ మోడి ప్ర‌సంగించారు.  త‌ర్వాత ట్రంప్ న‌మ‌స్తే న‌మ‌స్తే అంటూ త‌న ప్ర‌సంగం ప్రారంభించారు. ఆయ‌న ప్ర‌సంగంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.



- న‌మ‌స్తే న‌మ‌స్తే అంటూ ట్రంప్ ప్ర‌సంగం
- న‌న్ను ఇక్క‌డ‌కు ఆహ్వానించిన మోడీకి కృత‌జ్ఞ‌త‌లు
- 8 వేల మైళ్లు ప్ర‌యాణం చేసి ఇక్క‌డ‌కు వ‌చ్చాం
- మొతేరా స్టేడియం చాలా అద్భుతంగా ఉంది...
- అమెరికా భార‌త్‌ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది.
- ప్ర‌పంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి మ‌మ్మ‌ల‌ను ఆహ్వానించ‌డం ఆనందంగా ఉంది.
- గ‌తేడాది అద్భుత‌మైన మెజార్టీతో మోడీ ఘ‌న‌విజ‌యం సాధించారు.
- మోడీ గుజ‌రాతీయే కాదు దేశం గ‌ర్వించ‌ద‌గ్గ నేత‌..
- ఇంత గొప్ప ఆథిత్యం ఇచ్చినందుకు మోడీని ఎప్ప‌ట‌కీ గుర్తుంచు కుంటాం.



- మోడీ నా ఫ్రెండ్ అని చెప్పేందుకు నేను ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నాను
- ఇండియాకు రావ‌డం ఎంతో గ‌ర్వంగా ఉంది
- అభివృద్ధి కోసం మోడీ నిరంత‌రం క‌ష్ట‌ప‌డ‌తారు..
- భూ ప్ర‌పంచం మీదే మోడీ గొప్ప నేత‌..
- భార‌త్ - అమెరికా మ‌ధ్య స్నేహ బంధం మ‌రింత వ‌ర్థిల్లాలి..
- భార‌తీయులు ఏదైనా సాధించ‌గ‌ల‌రు అనేందుకు మోడీయే నిద‌ర్శ‌నం..
- 1.20 ల‌క్ష‌ల మందిని ఒకే చోట చూడ‌డం చాలా ఆనందంగా ఉంది..
- అమెరిక‌న్ల హృద‌యాల్లో ఇండియ‌న్స్‌కు ఎప్పుడూ ఇక్క‌డ ప్లేస్ ఉంటుంది..

- యువ‌కుడిగా ఉన్న‌ప్పుడు మోడీ టీ షాపులో ప‌నిచేశారు..అక్క‌డ నుంచి ప్ర‌ధాని స్థాయికి ఎదిగారు..
- బాలీవుడ్‌పై ట్రంప్ ప్ర‌శంస‌లు.. భార‌త సినిమా ప‌రిశ్ర‌మ గొప్ప‌ది..
- ప్ర‌పంచంలోనే భార‌త్ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల కేంద్రంగా మార‌బోతోంది..
- మాన‌వ‌త్వానికి చిరునామా భార‌త్‌
- స్వామి వివేకానంద గొప్ప పేరున్న వ్య‌క్తి
- యేడాదికి 2 వేల సినిమాలు నిర్మించే శ‌క్తి భార‌త్‌కు ఉంది..
- డీడీఎల్ సినిమాను ప్ర‌స్తావించిన ట్రంప్‌.. ప్ర‌శంస‌లు
- భార‌త క్రికెట్ గొప్ప‌ది... స‌చిన్ టెండుల్క‌ర్‌, విరాట్ కోహ్లీ లాంటి గొప్ప క్రికెట‌ర్లు ఉన్నారు..
- మోడీ నాయ‌క‌త్వంలో భార‌త్ ఎంతో పురుగ‌తిస్తోంది..



- సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు భార‌త్ పెద్ద‌పీట వేస్తోంది..
- మోడీని డీల్ చేయ‌డం చాలా క‌ష్టం
- ఈ ద‌శాబ్ద కాలంలో భార‌త్ ఎన్నో విజ‌యాలు సాధించింది..
- భార‌త సినిమాల‌ను ప్ర‌పంచం ఇష్ట‌ప‌డుతోంది...
- భార‌తీయ దీపావ‌ళి, హోళీ పండ‌గ‌ల పేర్లు ప్ర‌స్తావించిన ట్రంప్‌
- భార‌త సినిమాలు అయిన దిల్‌వాలే దుల్హేనియే, షోలే సినిమాలు గొప్ప‌వి


- భిన్న‌త్వంలో ఏక‌త్వానికి భార‌త్ ప్ర‌తీక‌
- ఐసిన్‌ను నూటికి నూరు శాతం తుడిచి పెట్టేశాం.
- ఉగ్ర‌వాదంపై క‌లిసి క‌ట్టుగా పోరాటం చేస్తున్నాం...
- 3 బిలియ‌న్ డాల‌ర్ల వ్యాపార ఒప్పందాలు కుదుర్చు కోబోతున్నాం...
- మోడీ క‌ఠినంగా ఉన్నా ఆయ‌న అంద‌రిని ప్రేమిస్తారు...
- భార‌త్ శ‌క్తి సామ‌ర్థ్యాలు వెల‌క‌ట్ట‌లేనివి..

మరింత సమాచారం తెలుసుకోండి: