ప్రపంచంలో చికెన్ అంటే ఇష్టపడని వారు ఉండరు.  చికెన్ తో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తుంటారు.. అవి తినేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. కోడి గుడ్లు మంచి పౌష్టికాహారంగా తీసుకుంటారు.  అయితే ఈ మద్య ప్రపంచంలో చిత్ర విచిత్రమైన వైరస్ లు వస్తున్నాయి.  ఇప్పటికీ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది.  ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సైతం ఓ వింత వైరస్ వల్ల కోళ్లు చనిపోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకుల గూడెం గ్రామ శివార్లలో ఉన్న కోళ్ల ఫారం సమీపంలో  భారీ సంఖ్యలో చనిపోయిన బాయిలర్ కోళ్లను పడవేయటంతో పెనుబల్లి తహశీల్దార్ కు నాయకుల గూడెం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.

 

సుమారు ముప్పై వేల కు పైగా కోళ్లను ఆరు బయట పడవేసినట్లు అధికారులు గుర్తించారు. ఏ కారణంగా బాయిలర్ కోళ్ళు చనిపోయాయి అనే విషయం పై పరిశోధన చేస్తున్నట్లు పశు వైద్యులు తెలిపారు. ఇప్పటికే పలు రకాల అంటూ వ్యాధులు వ్యాప్తి చెందుతూ మనుషులు అనారోగ్యాలకు గురి అవుతున్న క్రమం లో ఈ విధం గా భారీ సంఖ్యలో బాయిలర్ కోళ్ళు చనిపోవటం, వాటిన ఆరుబయట పడ వేయటం వల్ల మహా ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.  సాధ్యమైనంత వరకు వాటిని పూడ్చి పెట్టడం.. లేదా కాల్చి వేయడం చేయాలని కోళ్ల ఫామ్ యాజమాన్యాలకు సూచిస్తున్నారు. 

 

గత రెండు నెలల క్రితం వరకు కోళ్లకు మంచి గిరాకి ఉండేది.. వ్యాపారస్తులు కూడా సంతోషంగానే ఉండేవారు.. కానీ ఈ మద్య రక రకాల వైరస్ లు ఈ కోళ్లపై ప్రభావం చూపడంతో అనూహ్యంగా వాటి ధరలు తగ్గిపోతున్నాయి. ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియులు సైతం చికెన్ కొనాలంటేనే భయపడుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలైన.. ఆంద్రప్రదేశ్, తెలంగాణలో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: