అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఉదయం 11.40 గంటలకు భారత్ కు చేరుకున్నారు. అక్కడినుండి సబర్మతి ఆశ్రమానికి చేరుకున్న ట్రంప్ అక్కడ చరఖాను తిప్పి సందర్శకుల పుస్తకంలో సందేశం రాసి మొతెరా స్టేడియానికి వచ్చారు. మొతెరా స్టేడియానికి ఈరోజు లక్షల సంఖ్యలో జనం హాజరయ్యారు. ప్రజలు అడుగడుగునా ట్రంప్ కు నీరాజనం పలికారు. మొతెరా వేదికపై లక్షలాది మంది ప్రజలకు అభివాదం తెలిపి ట్రంప్ ప్రసంగించారు. 
 
ప్రపంచానికి భారత్ ఎదుగుదల ఒక మార్గదర్శనం అని భారత్ అద్భుతమైన అవకాశాలకు నెలవు అని ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం కొనసాగుతుందని ట్రంప్ చెప్పారు. మరోవైపు ఈ పర్యటనలో ట్రంప్ తో మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. మోదీ ఈ పర్యటనలో ప్రధానంగా రక్షణ ఒప్పందాలు, అపాచీ అటాక్ హెలికాఫ్టర్ల కొనుగోలు డీల్ గురించి మరియు హై ఆల్టిట్యూట్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ల కొనుగోలు గురించి ఒప్పందాలు చేసుకోనున్నారు. 
 
దేశ రాజధాని ఢిల్లీ రక్షణకు ఎయిర్ డిఫెన్స్ సిస్టం కొనుగోలు గురించి మరియు సాయుధ డ్రోన్ల గురించి మోదీ, ట్రంప్ మధ్య చర్చలు జరగనున్నాయి. నావల్ గన్స్, లాంగ్ మారిటైం ప్యాట్రోల్ ఎయిర్‌క్రాఫ్టులు, హేల్ డ్రోన్ల గురించి కూడా ఒప్పందాలు చేసుకోనున్నారు. మిస్సైల్ మరియు ప్రిడేటర్ బీ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలను అమెరికా భారత్ తో చేసుకోనుందని తెలుస్తోంది. 
 
ట్రంప్ భారత్ అమెరికా ఒప్పందాల గురించి మాట్లాడుతూ మూడు బిలియన్ అమెరికా డాలర్ల రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంటామని వ్యాఖ్యలు చేశారు. హెలికాఫ్టర్ల కొనుగోలు, అత్యాధునికమైన ఆయుధాల ఒప్పందాల గురించి సంతకాలు చేయనున్నట్టు ప్రకటన చేశారు. ప్రపంచాన్ని రాడికల్ ఇస్లాం పేరుతో ఇబ్బందులు పెడుతున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటామని అన్నారు. ప్రపంచానికి ఐసిస్ చీఫ్ మరణం గొప్ప ఊరట అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: